Vastu Tips: హిందూమత గ్రంధాల ప్రకారం షమీ చెట్టుకు చాలా మహత్యం ఉంది. జ్యోతిష్యం ప్రకారం షమీ చెట్టుతో చాలా రకాల వాస్తుదోషాల్నించి ఉపశమనం పొందవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతం ప్రకారం షమీ చెట్టును శని దేవుడితో సంబంధముందని చెబుతారు. శివుడి పూజలో షమీ చెట్టు పూలను నీళ్లలో వేసి అర్పిస్తారు. ఇలా చేయడం వల్ల శివుడు ప్రసన్నుడౌతాడు. శివుడి కటాక్షం కలుగుతుంది. షమీ మొక్కను ఇంట్లో నాటడం వల్ల చాలా రకాల వాస్తు దోషాల్నించి విముక్తి పొందవచ్చు. అయితే కొన్ని సూచనలు మాత్రం పాటించాలి.


షమీ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో దీర్ఘకాలంగా ఎదురౌతున్న పలు సమస్యలు తగ్గుతాయి. డబ్బులతో ముడిపడి ఉండే సమస్యలు తొలగిపోతాయి. డబ్బులొచ్చే మార్గాలు తెర్చుకుంటాయి. ఇంట్లో సుఖ శాంతులు వర్ధిల్లుతాయి. షమీ మొక్కతో వాస్తు దోషాల్నించి విముక్తి పొందవచ్చు. అనుకున్న పనులు పూర్తవుతాయి.


కొంతమందికి పెళ్లీడు వచ్చినా మంచి సంబంధాలు రావు. లేదా ముందుగా కుదుర్చుకున్న సంబంధాలు తెగిపోతుంటాయి. లేదా వైవాహిక జీవితంలో పలు చికాకులు ఎదురౌతుంటాయి. షమీ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఈ సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. శనిదోషం గురించి అందరికీ తెలిసిందే. శని ప్రభావం పడినవారి జీవితాలు నాశనమైపోతాయి. అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు. షమీ మొక్కతో ఈ దోషాల్ని విముక్తి పొందవచ్చు. శనిదోషం తగ్గిస్తుంది. శనివారం నాడు షమీ మొక్కను పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు దక్కుతాయి.


షమీ మొక్కను శనివారం నాడు ఇంట్లో నాటడం వల్ల లాభాలు కలుగుతాయి. దసరా రోజు కూడా నాటుకోవచ్చు. షమీ మొక్కను ఇంటి ముఖద్వారంలో అమర్చుకోవాలి. మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు మీ కుడిచేతివైపుండేలా అమర్చుకోవాలి. ఇంటి పైకప్పుపై నాటితే మాత్రం దక్షిణం మూలన పెట్టుకోవాలి. 


Also read: Mahalaya Amavasya 2022: మహాలయ అమావాస్య ఎప్పుడు, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook