Shani Amavasya 2022: శని అమావాస్య ఏ రోజు.. పూజా ముహూర్తం ఎప్పుడు.. శని గండం గట్టెక్కాలంటే ఏం చేయాలి..
Shani Amavasya 2022: శనిశ్చరి అమావాస్య ఈ ఏడాది ఏప్రిల్ 30న వస్తోంది. శనిశ్చరి అమావాస్య కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం నుంచి ఎలా బయటపడాలో ఇక్కడ తెలుసుకోండి.
Shani Amavasya 2022: శనిశ్చరి అమావాస్య లేదా శని అమావాస్య వైశాఖ మాసంలో వస్తుంది. ఈ నెల 30న సూర్యగ్రహణం రోజునే ఈ అమావాస్య వస్తోంది. శనిశ్చరి అమావాస్య నాడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని అనుగ్రహం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఏప్రిల్ 29న శని రాశి మారుతున్నందునా... మీన రాశి వారిపై దాని నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే కర్కాట, వృశ్చిక రాశి వారిపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. శని ప్రభావం నుంచి బయటపడాలంటే పాటించాల్సిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం...
శని అమావాస్య పూజ ముహూర్తం
శనిశ్చరి అమావాస్య ఏప్రిల్ 30, అర్ధరాత్రి 12:57 గంటలకు ప్రారంభమై మే 1వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 01:57 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో ప్రీతి యోగం మధ్యాహ్నం 03:20 వరకు ఉంటుంది. ఆయుష్మాన్ యోగం ప్రారంభమవుతుంది. ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పూజా క్రతువులకు అనుకూలమైన సమయం. రాహుకాలం ఉదయం 9 గం. నుంచి 10:39 గం. వరకు ఉంటుంది.
ఇలా చేస్తే శని అనుగ్రహం... శని గండం నుంచి విముక్తి :
శని మహాదశ వల్ల శని అనుగ్రహం పొందాలన్నా, చెడు ఫలితాల నుంచి ఉపశమనం పొందాలన్నా శనిశ్చరి అమావాస్య రోజున ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది. శనిశ్చరి అమావాస్య రోజున నది స్నానం ఆచరించడం వల్ల శని గండం లేదా ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. అన్ని బాధలు, ఆటంకాలు తొలగిపోతాయి.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని అమావాస్య రోజున శని దేవుడికి నీలం రంగు పుష్పాలు, నల్ల నువ్వులు, ఆవనూనె సమర్పించాలి. ఇలా చేస్తే శని దేవుడి అనుగ్రహం లభించి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. లేదంటే చేపట్టిన ప్రతీ పనిలో శని ఆటంకం కలగజేస్తుంది.
శని దుష్ప్రభావాల నుండి బయటపడటానికి ఒక మంచి మార్గం హనుమంతుడిని పూజించడం. హనుమాన్ ఆలయానికి వెళ్లి భగవాన్ హనుమాన్‌కి పూజ చేసి హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది.
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Saturn Transit 2022: నేడు కుంభరాశిలోకి శని.. ఏ రాశుల వారికి మంచిది... ఏ రాశుల వారికి చెడు జరుగుతుంది
Also Read: Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయొద్దు... చేస్తే అశుభమే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook