shani amavasya january 2023: ఈరోజు మాఘమాసం అమావాస్య. శనివారం నాడు వచ్చే అమావాస్యను శనిశ్చరి అమావాస్య అంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య శనివారం రోజు రావడం చాలా ప్రత్యేకమని.. కాబట్టి ఈరోజు శనిదేవుని పూజించడం వల్ల జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలగడమే కాకుండా శని చెడు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు శని దేవుని పూజించే క్రమంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటించి పూజా కార్యక్రమాలతో పాటు దానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. శని గ్రహం కుంభరాశిలో సంచార దశలో ఉంది కాబట్టి.. ఈరోజు అన్ని రాశుల వారు శని దేవుని పూజించడం వల్ల జీవితంలో చాలా లాభాలు పొందుతారు. అయితే ఈరోజు శని దేవుని ఎలా పూజించాలి మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని దేవుడిని పూజించే విధానం..


ఉదయాన్నే లేచి స్నానం చేయాలి.
స్నానం చేసిన తర్వాత ఇంటి గుడిలో దీపం వెలిగించాలి. 
శని దేవుని విగ్రహానికి ఆవాల నూనెతో అభిషేకం చేయాలి.
శని దేవుడికి ఇష్టమైన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా పూలు, పండ్లు తప్పకుండా శని పూజలు భాగం చేయాల్సింది. 
నైవేద్యాలు సమర్పించిన తర్వాత తప్పకుండా శని దేవుడికి హారతి నివ్వాల్సి ఉంటుంది.
హారతి కార్యక్రమంలో భాగంగా శని చాలీసా పఠించండి
శని దేవుడి మంత్రాలను జపించండి. 
ఈ విషయాలను గుర్తుంచుకోండి:


శనిదేవుని కళ్లలోకి చూడకండి:
హిందూ పురాణాల ప్రకారం శని దేవుని పూజించే క్రమంలో శని కళ్ళలోకి చూడడం మంచిది కాదు. ఒకవేళ శని దేవుడి కళ్ళలోకి చూడడం వల్ల చెడు ప్రభావం జీవితం పై పడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శని దేవుని పూజించే క్రమంలో ఎప్పుడు కూర్చుని మాత్రమే పూజించాల్సి ఉంటుంది. లేదంటే చాలా రకాల నష్టాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.


Also Read:  Rakesh Sujatha Marriage : పెళ్లి చేసుకోబోతోన్న సుజాత రాకేష్.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పేసిన జోర్దార్ జంట


Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook