Shani Amavasya 2022: శనిదేవుడిని న్యాయ దేవుడు అంటారు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని వక్రదృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం నాశనం అయిపోవడానికి ఎంతో సమయం పట్టదు. అందుకే శనిదేవుడి (Shani Dev) అనుగ్రహం పొందడానికి పూజలు చేస్తూ ఉంటారు. మీరు శని దోషం, సడే సతి, ధైయా నుండి బయటపడాలంటే శనిశ్చరి అమావాస్య నాడు ఈ పరిహారాలు చేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిశ్చరి అమావాస్య ఎప్పుడు?
అమావాస్య శనివారం వస్తే దానిని శని అమావాస్య లేదా శనిశ్చరి అమావాస్య (Shani Amavasya 2022) అంటారు.  ఈసారి ఇది భాద్రపద మాసంలో వస్తుంది. ఈ రోజు దానం చేయడం, పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, వారిని పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈసారి భాద్రపద అమావాస్య ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 12.23 గంటల నుంచి ప్రారంభమై.. ఆగస్టు 27 మధ్యాహ్నం 1.46 గంటలకు ముగుస్తుంది. ఈసారి శనిశ్చరి అమావాస్య నాడు శివయోగం కూడా ఏర్పడుతోంది. ఆగష్టు 27వ తేదీ ఉదయం నుండి మరుసటి రోజు ఆగస్టు 28వ తేదీ తెల్లవారుజామున 02:07 వరకు ఈ యోగం ఉంటుంది.


ఈ పరిహారాలు చేయండి
>> శనిశ్చరి అమావాస్య రోజున శనిదేవుడి ఆలయానికి వెళ్లి పూజలు చేయండి. మీరు గుడిలో దేవుడి ముందు శని చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషించి భక్తులపై అనుగ్రహం కురిపిస్తాడు. 
>> ఈసారి భాద్రపద అమావాస్య నాడు శని దేవుడి విగ్రహానికి ఆవాల నూనెతో అభిషేకం చేయండి. దీని తరువాత, ధూపం, దీపం, నల్ల నువ్వులు దేవుడి ముందు పెట్టండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తాడు.  
>> మీకు శని దోషం, సడేసతితో బాధపడుతున్నట్లయితే.. మీరు శనిశ్చరి అమావాస్య నాడు శనిదేవుని ఆలయానికి వెళ్లి పూజించాలి. అవసరమైన వ్యక్తులకు స్టీల్ పాత్రలు, నల్ల నువ్వులు, నల్ల ఉసిరి, ఇనుము మరియు శని చాలీసాను దానం చేయండి. ఇలా చేయడం ద్వారా శనిదేవుడి పెట్టే బాధల నుండి విముక్తి పొందవచ్చు.  
>>  శనిశ్చరి అమావాస్య నాడు శని రక్షా స్తోత్రాన్ని పఠించాలి. దీనిని అయోధ్య రాజు దశరథుడు స్వయంగా రచించాడని చెబుతారు. దీనిని పఠించడం ద్వారా శనిదేవుడి సంతోషించి భక్తులను అన్ని కష్టాల నుండి కాపాడతాడు. 


Also Read: Mercury Transit In Virgo 2022: కన్య రాశిలో బుధ సంచారం... రాబోయే 2 నెలలు ఈ రాశులకు కష్టకాలం! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook