Saturn Combust 2023: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. శని గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు రెండున్నర సమయం పడుతుంది. ప్రస్తుతం శనిగ్రహం కుంభరాశిలో అస్తమించింది. మళ్లీ అతడు మార్చి 6న ఉదయించనున్నాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, ఏదైనా గ్రహం యెుక్క  అస్తమయం అశుభకరమైనదిగా భావిస్తారు. దీని వల్ల కొన్ని రాశులవారు చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ అన్ లక్కీ  రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేషరాశి వ్యక్తుల జాతకంలో శనిదేవుడు 11వ ఇంట్లో ఉన్నాడు. శని అస్తమించడం వల్ల మేష రాశి వారు కెరీర్ లో అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది.  ఎందులోనైనా డబ్బు పెట్టుబపడి పెట్టేముందు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. అంతేకాకుండా శనిదేవుడు మీపై కోపంగా ఉంటాడు. 
వృషభం (Taurus)
కుంభరాశిలో శని అస్తమించడం వల్ల ఈ రాశి వారి జీవితంలో సమస్యలు  పెరుగుతాయి. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. శని అస్తమించడం వల్ల మీ తల్లిదండ్రుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీరు కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు.  
మిధునరాశి (Gemini)
శని దేవుడిని మిధున రాశికి అధిపతిగా భావిస్తారు.. ఈ రాశికి చెందిన వారి జాతకంలో తొమ్మిదవ ఇంట్లో శని సెట్ చేయబడింది. దీని కారణంగా దురదృష్టం మిమ్మిల్ని వెంటాడుతుంది. కొన్ని వార్తలు మిమ్మిల్ని మానసికంగా కృంగదీస్తాయి. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. 
తులారాశి (Libra)
తులారాశిలోని ఐదవ ఇంట్లో శని అస్తమించాడు. దీని వల్ల మీరు అనేక కష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. సంతాన సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తతాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. 


Also Read: Venus Transit 2023: సరిగ్గా 5 రోజుల తరువాత ఈ రాశివారికి తిరగనున్న దశ, జీవితమంతా డబ్బే 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook