Shani Dev: శనివారం శని దేవునికి ఎంతో ఇష్టమైన రోజూ ఆ రోజు శని దేవున్ని పూజించడం వల్ల మనిషి జీవితంలో చాలా రకాల మార్పులు వస్తాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే శని దేవుని చెడు ప్రభావం మని జీవితపై పడితే తీవ్ర నష్టాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా రావొచ్చు. కాబట్టి శని దేవుని చెడు ప్రభావం జీవితంపై పడకుండా ఉండాలంటే జీవితంలో నిజాయితీగా జీవించాల్సి ఉంటుంది. లేదంటే శని దేవుని ప్రభావం పడే అవకాశాలున్నాయని జోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ శిని తీవ్రమైన చెడు ప్రభావం పలు రాశువారికి కూడా కలుగొచ్చు. అయితే శనీశ్వరుడు శుభస్థానంలో ఉన్న చోట సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. అయితే ఈ కింద పేర్కొన్న రాశువారికి శని మంచి ప్రభావం కురిపించబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శిని దేవుని మంచి ప్రభావం వల్ల పలు రాశువారి జీవితంలో మంచి ఫలితాలు పొందే అవకాశాలే ఉంటాయి. మఖ్యంగా ఆ రాశువారికి శని దేవుడి ఆశీర్వదాలు లభించి అనుకున్న పనులన్ని సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా కోరికలు కూడా నెరవేరుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే శని దేవుని మంచి ప్రభావం ఏయే రాశులపై ఉండబోతోందో.. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..


తుల రాశి:
శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు తుల రాశి వారికి ఎల్లప్పుడు ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి శని దేవుడు ఉన్నత దశలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారు ఎల్లప్పుడూ మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ రాశువారు కష్టపడి పనులు చేస్తే.. జీవితంలో ఉన్న శిఖరాలను చేరుతారు. అంతేకాకుండా శనిశ్వరుని అనుగ్రహం లభించి జీవితం మొత్తం శుఖ సంతోషాలు పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కాబట్టి శని వారు రోజు ఈ రాశి వారు శని దేవునికి పూజలు చేయండి.


తుల రాశి వారికి శని దేవుని మంచి ప్రభావం వల్ల యజమానులుగా మరే అవకాశాలు కూడా ఉన్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ రాశి వారు శనివారం రోజు దానాల చేయడం వల్ల జీవితంలో ఉన్నతంగా జీవించగలుగుతారు. అంతేకాకుండా ఎప్పుడు అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. దీంతో జీవితంలో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.


మకర:
మకర రాశి వారికి శని దేవుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. దీంతో ఎప్పుడు మకర రాశి వారి జీవితాల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శని గ్రహం రాశుల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారు ఎక్కువగా ప్రయోజనాల కూడా పొందుతారు. అయితే శని దేవుడి అనుగ్రహం ఈ రాశి వారికి ఎల్లవేళల లభిస్తుంది. జీవితంలో అనుకున్న పనులన్ని చేసు అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మకర రాశి వారు జీవితంలో ఎక్కువగా కష్టపడితే ఉన్నతంగా జీవించ గలుగుతారు. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా పొందుతారు.


(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Kaala Bhairava: శత్రువులను జయించేందుకు కాలభైరవ పూజ చేయండి.. శనివారం పూజ చేస్తే విజయం మీదే..


Also Read: Team India: ఒకే ఏడాదిలో 8 మంది కెప్టెన్లు.. కేఎల్ రాహుల్ ఫ్లాప్‌ షో.. సెలక్టర్లు ఇలా చేసినందుకే..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook