COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani Dev Favourite Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవునికి ఎంతో ప్రత్యేకత ఉంది. అంతేకాకుండా శని గ్రహాన్ని కూడా గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో తిరోగమన దశలో ఉంది. అయితే ఈ గ్రహం 2024 సంవత్సరం జూన్ 30వ తేదీన తిరోగమనం చేయబోతోంది. కుంభ రాశిలో ఉన్న శని రివర్స్‌లో తిరగబోతున్నాడు. అయితే శనిగమనంలో మార్పులు రావడం వల్ల శుభ యాదృచ్చికం ఏర్పడుతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని తిరోగమనం కారణంగా 2024 సంవత్సరంలో ఏయే రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:
మేష రాశి వారికి శనితిరోగమనం కారణంగా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల నుంచి ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. ఇక స్నేహితుల సహాయంతో ఉద్యోగ అవకాశాలు కూడా పొందుతారు. దాంపత్య జీవితం విషయానికొస్తే భాగస్వామితో ఎంతో ప్రేమతో జీవనం సాగిస్తారు. ఆదాయం పెరగడమే కాకుండా కుటుంబ బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వారికి ఈ సమయంలో ప్రమోషన్ కూడా లభించబోతోంది.


వృషభ రాశి:
2024 సంవత్సరంలో శని తిరోగమనం కారణంగా వృషభ రాశి వారు కూడా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. దీంతోపాటు కుటుంబ సభ్యులతో మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. శని గ్రహం తిరోగమనం కారణంగా ఈ సమయంలో ఉన్నత విద్యా పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు ఆఫీసులో మారే ఛాన్స్ కూడా ఉంది. ఈ సమయంలో మనసులో ప్రశాంతత పెరిగి సంతోషం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఉద్యోగం మారడం కారణంగా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన మీకు మీ తోటి ఉద్యోగుల సపోర్ట్ లభిస్తుంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


మిథునరాశి:
2024 సంవత్సరంలో శని అనుగ్రహం మిథున రాశి వారికి కూడా లభించబోతోంది. ఈ సమయంలో తల్లిదండ్రుల నుంచి పూర్తి సపోర్టు లభించి ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. దీని కారణంగా మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అంతేకాకుండా వీరు కొత్త బట్టలు ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు కార్యాలయాల్లో మంచి పేరు సంపాదిస్తారు. దీంతోపాటు వీరి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్లొచ్చు.


సింహరాశి:
2024లో జరిగే శని తిరోగమన ప్రభావం సింహ రాశి వారిపై కూడా ప్రత్యక్షంగా పడబోతోంది. దీని కారణంగా సింహ రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మనసులో ప్రశాంతత రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ సమయంలో మంచి కంపెనీలో జాబ్‌లు పొందుతారు. పరిశోధనలు చేసేవారు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వారికి అధికారుల మద్దతు లభించి కార్యాలయాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter