Shani Dev Blessings Till 2025: శని గ్రహ సంచారం మరో రెండు సంవత్సరాల వరకు కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శని దేవుడే అనుగ్రహం వల్ల మేష రాశి తో పాటు మరో రెండు రాశుల వారికి సౌఖ్యం ఆదాయ వనరులు సౌకర్యాలు లభిస్తాయి. కర్మలకు అధిపతిగా వ్యవహరించే శని గ్రహం చాలా నెమ్మదిగా రాశి సంచారం చేస్తూ ఉంటుంది ప్రస్తుతం శనిగ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచార దశలో ఉంది. ఈ గ్రహం 2025 సంవత్సరం వరకు అదే రాశిలో ఉంటుంది 2024 సంవత్సరంలో మాత్రం శని గ్రహం ప్రత్యేక సంచారం తీరోగమనం కొనసాగించనుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి శని గ్రహం గమనంలో మార్పులు కారణంగా ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
కుంభరాశిలో శని గ్రహం స్థిరంగా ఉండడం కారణంగా మేష రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ పరంగా ఊహించని లాభాలు కూడా పొందుతారు. దీంతోపాటు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాల సాధిస్తారు. కుటుంబంతో రెండు సంవత్సరాల పాటు ఎంతో సుఖంగా ఉంటారు. అయితే మీ మీ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. ఈ గొడవలను ఓపికతో పరిష్కరించుకోవడం చాలా మంచిది.


Also read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా


సింహరాశి:
కుంభ రాశిలో శని ఉండడం కారణంగా సింహ రాశి వారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందడమే కాకుండా వ్యాపారాలు రెట్టింపు లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి అదృష్టం ఎప్పుడు వెంటే ఉంటుంది. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయంలో మంచి కంపెనీలలో ఉద్యోగాలు లభిస్తాయి.


తులారాశి:
శని అనుగ్రహం వల్ల కుంభ రాశి వారికి కూడా మరో రెండు సంవత్సరాల పాటు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో అన్నీ సానుకూల నిర్ణయాలే తీసుకుంటారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే వారికి భవిష్యత్తులో ఊహించని లాభాలు కలుగుతాయి. ఇక విద్యార్థుల విషయానికొస్తే మంచి శుభవార్తలు వింటారు. కానీ వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter