Shani Dev Effect 2024: శని నక్షత్ర అద్భుత కదలికలు.. ఈ రాశులవారికి దీపావళి వరకు అపార ధనయోగం..
![Shani Dev Effect 2024: శని నక్షత్ర అద్భుత కదలికలు.. ఈ రాశులవారికి దీపావళి వరకు అపార ధనయోగం.. Shani Dev Effect 2024: శని నక్షత్ర అద్భుత కదలికలు.. ఈ రాశులవారికి దీపావళి వరకు అపార ధనయోగం..](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2024/10/13/380262-shani-dev-effect-2024.jpg?itok=oRJFG9f-)
Shani Dev Effect 2024: శని నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశులవారికి దీపావళి నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Shani Dev Effect 2024: శని గ్రహం కొన్ని త్వరలోనే నక్షత్ర కదలికలు చేయబోతోంది. దీని కారణంగా కారణంగా ఈ వారం నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం శని గ్రహం శతభిషా నక్షత్రంలోకి ఉన్నాడు. అయితే త్వరలోనే ఇదే గ్రహంలో కదలికలు జరపబోతున్నాడు. నవంబర్ 15వ తేదిన కదలికలు చేయబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అయితే ఈ గ్రహం చాలా అరుదుగా రాశి సంచారం చేస్తుంది. అందుకే శని గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. శని గ్రహం నక్షత్ర కదలికల కారణంగా ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
ఈ రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం:
మీన రాశి:
శనిగ్రహం నక్షత్రంలో కదలికల కారణంగా మీన రాశివారికి అద్భుతంగా ఉంటుంది. వీరికి జీవితంలో వస్తున్న ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే దీపావళి సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు ఈ సమయంలో అద్భుతమైన శక్తిని పొందుతారు.
వృషభ రాశి:
శని కదలికల కారణంగా వృషభ రాశివారికి కెరీరలో విపరీతమైన మార్పులు వస్తాయి. అంతేకాకుండా కెరీర్ జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో వస్తున్న కొన్ని ప్రధానమైన సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
కుంభ రాశి:
శని ప్రత్యేక్ష కదలిక కారణంగా కుంభ రాశివారిపై కూడా ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి కాస్త ఖర్చలు పెరిగినప్పటికీ అనేక సమస్యలు తొలగిపోతాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అలాగే ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మిథున రాశి:
శని నక్షత్ర కదలికల కారణంగా చాలా మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి విభిన్న ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. దీంతో మిథున రాశివారికి అనేక శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.