Saturn Transit in Aquarius 2023: జ్యోతిషశాస్త్రంలో శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. దీని గ్రహ స్థితిలో మార్పు మెుత్తం 12 రాశులవారిపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపుతుంది. జనవరి 17, 2023న శనిదేవుడు తన రాశిని మార్చుకుని కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. 30 ఏళ్ల తర్వాత శనిగ్రహం తన స్వంత రాశిచక్రమైన కుంభరాశిలో సంచరించనున్నాడు. కుంభంలో శని గ్రహం సంచారం 4 రాశులవారిని ధనవంతులను చేస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. శని కుంభరాశిలో ప్రవేశించిన వెంటనే మీన రాశిపై సడే శతి మొదటి దశ మొదలవుతుంది.  కర్కాటక, వృశ్చిక రాశి వారిపై శని ధైయా ప్రారంభం అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus) - శని సంచారం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు ఏదైనా పెద్ద పదవి పొందే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా సానుకూలంగా ఉంటుంది. లవ్ లైఫ్ బాగుంటుంది. వివాహం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. 


మిథునం (Gemini)- శని రాశి మార్పు మిథున రాశి వారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిస్తాడు. కెరీర్ లో అపారమైన పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు గొప్ప విజయాలు సాధిస్తారు. వీరి బిజినెస్ విస్తరిస్తుంది. పూర్వీకుల ఆస్తుల నుండి లాభం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.


తుల రాశి (Libra)- తులారాశి వారికి శని సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారిపై శని సడే సతి తొలగిపోతుంది. దీంతోఈ రాశివారు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ వృత్తిలో రాణిస్తారు. ఆర్థికంగా మునుపటి కంటే బలపడతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు. సమాజంలో మీకు గౌరం పెరుగుతుంది. 


ధనుస్సు (Sagittarius)- ధనుస్సు రాశి వారికి శని సడే సతి నుండి విముక్తి లభిస్తుంది. దీంతో పాటు వారి బాధలు కూడా దూరమవుతాయి. ఆదాయంలో రెట్టింపు లాభం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


Also read: Mercury Vakri 2023: కొత్త ఏడాదిలో తిరోగమనంలో బుధుడు.. ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.