Shani Dev: మార్చి 15 నుండి వీరు పట్టిందల్లా బంగారం.. ఇందులో మీ రాశి ఉందా?
Shani Gochar 2023: శనిదేవుడు ఈ నెల మధ్యలో శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. శని గ్రహం యెుక్క ఈ రాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Changes March 2023: శని గ్రహం మార్చి 15, 2023 ఉదయం శతభిషా నక్షత్రం మొదటి దశలోకి ప్రవేశిస్తుంది. అతడు అక్టోబర్ 17 వరకు అక్కడే ఉంటాడు. శని యెుక్క ఈరాశి మార్పు కారణంగా కొందరి జీవితాల్లో పెను మార్పు రానుంది. దీంతో ఆరు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
శని సంచారం ఈ రాశులకు వరం
మకరం (Capricorn)- శనిదేవుడు మీ రెండవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీని కారణంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీ మాటలను అదుపులో ఉంచుకోండి.
ధనుస్సు (Sagittarius)-ధనుస్సు రాశి వారు మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. జాబ్ కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతుంది. బిజినెస్ వృద్ధి చెందుతుంది. వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం.
తుల (Libra)- తుల రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది. బిజినెస్ విస్తరిస్తుంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీకు కొత్త అవకాశాలు వస్తాయి.
సింహం (Leo)- ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు చాలా ఆర్డర్లను పొందుతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీకు మీ కలల జాబ్ వస్తుంది.
మిథునరాశి (Gemini)- శనిదేవుడు మీ రాశి యెుక్క తొమ్మిదో ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. మీరు వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ కెరీర్ బాగుంటుంది. మీరు శుభవార్తలు వింటారు.
మేషం (Aries)– కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.
Also Read: Budh Gochar 2023: బుధుడి మేషరాశి ప్రవేశం.. ఈ 5 రాశులకు తిరుగులేనంత ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook