Shani Dev Lucky Zodiac Signs: అన్ని గ్రహాలకు  ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో దాని కంటే ఎక్కువ ప్రాముఖ్యత శని గ్రహానికి ఉంటుంది. అందుకే ఈ గ్రహాన్ని ప్రత్యేకమైన గ్రహంగా చూస్తారు. ముఖ్యంగా ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కీడు గ్రహంగా కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే శని గ్రహం చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. అయితే ఈ సంచారం చేసే క్రమంలో ఏలినాటి శని ప్రభావం కొన్ని రాశుల వారిపై పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో అనేక సమస్యలు రావడమే కాకుండా జీవితంలో వివిధ రకాల చిక్కులు ఏర్పడతాయి. అలాగే ఎలాంటి పనులు నిర్వహించిన ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే శని గ్రహం సంచారం చేయడమే కాకుండా తిరోగమనం కూడా చేస్తుంది. ఇలా తిరోగమనం చేయడానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 15వ తేదీన శనిగ్రహం తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ శని తిరోగమనంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనస్సు రాశి: 
నవంబర్ 15వ తేదీ నుంచి ధనస్సు రాశి వారు శని అనుగ్రహాన్ని పొందుతారు. దీని కారణంగా వీరు విపరీతమైన ధన లాభాలు పొందే అవకాశాలున్నాయి. అలాగే కెరీర్ కు సంబంధించిన జీవితంలో అనేక మార్పులు వచ్చి అనుకున్న పనులు వెంటవెంటనే చేయగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశి వారికి అదృష్టం పెరిగి వ్యాపారాల్లో లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల రెట్టింపు లాభాలు పొందుతారు. 


కర్కాటక రాశి: 
కర్కాటక రాశి వారికి కూడా శని తిరోగమనం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి నవంబర్ 15వ తేదీ నుంచి అనుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయి. అలాగే ప్రతి పనిలో విజయం సాధించగలిగే శక్తిని కూడా పొందుతారు. దీంతోపాటు కెరీర్ కు సంబంధించిన జీవితంలో కూడా అనేక లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీంతోపాటు వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు, గతంలో ఉన్న నిందలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


మిధున రాశి: 
మిధున రాశి వారికి కూడా నవంబర్ 15వ తేదీ నుంచి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి కూడా కోరికలు నెరవేరడమే కాకుండా గతంలో పోయిన డబ్బులు తిరిగి వస్తాయి.  అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలావరకు మెరుగుపడే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వచ్చి కెరీర్ కు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో శాంతి పెరగడమే కాకుండా శ్రేయస్సు లభిస్తుంది. ఆర్థికపరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.