Surya Grahan and Shani Dev Nakshtra Parivartana 2024: గ్రహణాలు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం సూర్య, చంద్రగ్రహణాలు సంభవిస్తాయి. ఈ ఏడాది మెుదటి సూర్యగ్రహణం వచ్చే నెల 08న ఏర్పడబోతుంది. ఈసారి సూర్యగ్రహణం మీనరాశిలో జరగబోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ గ్రహణానికి రెండు రోజుల ముందు అంటే ఏప్రిల్ 06 మధ్యాహ్నం 3:55 గంటలకు కర్మఫలదాత అయిన శని తన నక్షత్రాన్ని మార్చి బృహస్పతి నక్షత్రమైన పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యగ్రహణం మరియు శని యొక్క నక్షత్రం మార్పు మూడు రాశులవారికి అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


మకరం: మకరరాశి వారికి శనిదేవుడు నక్షత్రం మార్పు చాలా లాభాలను ఇస్తుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీరు అప్పుల ఊబి నుండి బయటపడతారు. మీరు చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ ఫైనాన్షియల్ గా మంచి స్థితిలో ఉంటారు. మీరు దారిద్ర్యం నుండి బయటపడతారు. 
మేషం: సూర్యగ్రహణం, శని నక్షత్రం మార్పు కారణంగా మేషరాశి వారు కెరీర్ లో కొత్త శిఖరాలను చేరుకుంటారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది.  మీ జీవీతంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీరు ఏ కార్యం తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. 


Also Read: Ranga Panchami 2024: ఇండోర్ లో జరిగే రంగ పంచమి పండుగకు లక్షల్లో జనాలు ఎందుకు వస్తారు.. అంత స్పెషల్ ఏంటి?


వృషభం: శనిదేవుడు నక్షత్ర సంచారం కారణంగా వృషభరాశి వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. బిజినెస్ చేసేవారు మునుపెన్నడూ చూడని లాభాలను చూస్తారు. మీ ఆర్థికంగా పటిష్టమవుతారు. 
(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Hindu Calendar April 2024: ఏప్రిల్‌లో రానున్న పండుగల జాబితా.. శుభముహూర్తాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook