Shani Dev Remedies: వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకి అంకితం అని అందరికీ తెలుసు. దీని ప్రకారం.. శనివారం శని దేవుడికి అంకితమైనదిగా పరిగణిస్తారు. శని దేవుని ఆగ్రహం పొందిన వారు జీవితాంతం అనేక కష్టాలను ఎదుర్కొక తప్పదని ప్రజలు నమ్ముతారు. అలాంటి పరిస్థితుల్లో శని దేవున్ని ప్రసన్నం చేసుకోవడం ఎంతో ముఖ్యమని వారు అభిప్రాయపడుతుంటారు. అయితే కొన్ని మార్గాల ద్వారా శని దేవున్ని ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంది. అలా చేయడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదురుకావని ప్రజలు నమ్ముతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని దేవునికి నలుపు రంగు చాలా ఇష్టం


శని దేవుడి తల్లి పేరు ఛాయా దేవి అని ప్రజలు నమ్ముతారు. ఆమె గర్భం దాల్చినప్పటి నుండి శివుని గురించి కఠోర తపస్సు చేసేది. ఈ కారణంగా, ఆమె గర్భధారణ సమయంలో తన ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోయింది. అదే సమయంలో శని దేవుడు జన్మించాడని.. పోషకాహార లోపం వల్ల ఆయన ముదురు రంగు చర్మంతో పుట్టాడని పురణాలు చెబుతున్నారు. ఈ కారణంగా శని దేవున్ని కొడుకుగా అంగీకరించేందుకు ఛాయా దేవి భర్త సూర్య దేవ్ అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ తర్వాత తన తప్పును గ్రహించి శని దేవున్ని తన కొడుకుగా స్వీకరించాడు. అప్పటి నుంచి శనిదేవునికి నలుపు రంగు ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. 


శనివారం నల్లని దుస్తులు ధరించండి


మీరు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే, శనివారం నాడు నల్లని దుస్తులు ధరించండి. ఇందులో నల్లని చొక్కా లేదా నలుపు ప్యాంటు ఉండవచ్చు. మహిళలు నలుపు రంగు సూట్లు లేదా సల్వార్‌లు కూడా ధరించవచ్చు. ఒకవేళ నల్లని దుస్తులు లేని క్రమంలో కనీసం జేబు రుమాల్ అయినా.. నల్ల రంగుది వాడడం మేలు. ఎందుకంటే శనివారం నలుపు రంగు దుస్తులు ధరించిన వారికి శనిదేవుడు ప్రసన్నమవుతాడని నమ్మకం. శని దేవుడికి తప్పా.. మరే దేవుడి పూజలో నలుపు రంగు బట్టలు ధరించకూడదు. 


నల్ల వస్తువులను దానం చేయండి


శని దేవుడిని పూజించేటప్పుడు నల్ల నువ్వులు, నల్ల శనగలు, ఇనుప వస్తువులు సమర్పిస్తారు. దీంతోపాటు శనివారాల్లో నల్లరంగు వస్తువులను నిరుపేదలకు అందజేసే వాళ్లు కూడా ఉన్నారు. వీటిలో నల్ల నువ్వులు, నల్ల శనగలు, ఆవాల నూనె కూడా శనివారం దానం చేయవచ్చు. శని దేవుడిని ఆరాధించే సమయంలో, పరిశుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. ఇలా చేయకపోతే శని దేవుడికి కూడా కోపం వస్తుంది.


పూజలో రాగి పాత్రలను ఉపయోగించవద్దు


శని దేవుడిని పూజించే సమయంలో రాగి పాత్రలను ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి. వాస్తవానికి రాగి సూర్యుడి లోహంతో తయారు చేయబడింది. శనిదేవునికి పూజ చేసే సమయంలో రాగి పాత్రలను వాడితే శనిదేవుని ఆగ్రహానికి గురవ్వక తప్పదు. అంతే కాకుండా శని దేవునికి ఎరుపు రంగుకు సంబంధించిన వస్తువులను సమర్పించవద్దు. శని దేవుడు నలుపు రంగు తప్ప మరే కలర్ ను ఆయన ఇష్టపడరు. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికలు, నమ్మకాల నుంచి గ్రహించినది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 


ALso Read: Kuber Mantra: కుబేరుడి మంత్రం ప్రతి రోజు జపిస్తే మీకు ప్రతి రోజు డబ్బుల వర్షమే..


Also Read: Sun Transit May 2022: మే 15 నుండి సూర్య సంచారం.. ఈ 6 రాశుల తలరాతే మారిపోనుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.