Saturday Magical Remedies: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని దేవుడుని న్యాయ దేవతగా పరిగణిస్తారు. ఓ వ్యక్తి మంచి, చెడు కర్మల ఫలాన్ని శని దేవుడు ఇస్తాడు. ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని బలంగా ఉన్నప్పుడు అదే వ్యక్తి రారాజు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకే ఓ వ్యక్తి జీవితంలో శని కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరూ కూడా శని గ్రహానికి గురవాలని కోరుకోరు. శని బలంగా ఉంటే నివారణ చర్యలు లేదా పరిహారం చేసి శని దేవుని అనుగ్రహం పొందుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి శనివారం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత శని దేవుడిని పూజిస్తే.. శని దేవుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. శనివారం నాడు ఈ చర్యలు ప్రయత్నించినట్లయితే శని మంచి దృష్టి మీపై ఉంటుంది. శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటే.. ఓ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటాడు. శని దేవుడి అనుగ్రహం వల్ల ఓ వ్యక్తి జీవితమే పూర్తిగా మారిపోతుంది. 


ఆవుకి రొట్టె: 
హిందూ మతంలో శని దేవుడుని న్యాయ దేవతగా పరిగణిస్తారు. శని దేవుడు ప్రకోపం వల్ల వ్యక్తి నశిస్తాడని నమ్ముతారు. శని వక్ర దృష్టి నుంచి తప్పించుకోవాలంటే.. శనివారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది. శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆవుకు నూనెతో కలిపిన రొట్టెను తినిపించాలి.  


బ్రహ్మ ముహూర్తంలో పూజ:
శనివారం నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి శని దేవుడిని పూజించాలి. ఇది చేస్తే జీవితంలో దుఃఖం మరియు వైఫల్యాలు తొలగిపోతాయి. దాంతో ఆ వ్యక్తి జీవితంలో అదృష్టం వస్తుంది.


కంచు పాత్రలో ఆవ నూనె:
ఒక కంచు పాత్రలో ఆవ నూనె తీసుకుని అందులో ముఖాన్ని పెట్టి చూడాలి. ఆ నూనెను శని దేవాలయంలో పెట్టాలి. నూనెతో పరాటాలు చేసి ఆవు దూడకు తినిపించాలి. 


నల్ల గుడ్డలో బియ్యం:
శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి.. దాన్ని శని దేవుని పాదాల చెంత ఉంచాలి. శని దేవుని ముందు ఆవ నూనె దీపం వెలిగించి.. ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు అన్ని తొలగిపోతాయి. 


Also Read: కంటెంట్‌ బాగుంటే.. ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు! చిరంజీవి ట్వీట్ వైరల్


Also Read: Kesineni Nani:చంద్రబాబుకు ఇవ్వాల్సిన బొకేను విసిరిగొట్టిన కేశినేని నాని.. టీడీపీలో కలకలం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook