Shani Dev Remedies: శని దేవుడు గత జన్మలు మరియు ఈ జన్మ యొక్క కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. కావున శనిదేవుడిని కలియుగానికి అధిపతిగా పేర్కొంటారు. మనం చేసే మంచి, చెడులను ఆధారంగా ఫలాలను ఇస్తాడు. కాబట్టి శనిదేవుడిని (Shani Dev) న్యాయదేవుడు అంటారు. శనిదేవుడు విగ్రహం ముందు ఎప్పుడు ఎదురుగా నిలబడవద్దు. ఎందుకంటే శనిదేవుడి దృష్టి నేరుగా మనపై పడిందంటే మన జీవితం నాశనమవుతుంది.  అందుకే శని దృష్టి మనపై పడకుండా చూసుకోవాలి. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని వక్ర దృష్టి ఎవరిపై ఉంటుందో తెలుసా..
శనిదేవుడు చెడు పనులు చేసేవారిని విడిచిపెట్టడు, అందుకే అతన్ని క్రూర గ్రహం అంటారు. ఇతరులను ఇబ్బంది పెట్టేవారికి శనిదేవుడు కష్టాలు కలిగిస్తాడు. స్త్రీలు, వృద్ధులు, నిస్సహాయులు, వికలాంగులు మరియు పని చేసే కూలీలను వేధించే వారిని శనిదేవుడు ఇబ్బందులకు గురిచేస్తాడు. అదే విధంగా ఇతరులను మోసం చేసేవారిని, అబద్ధాలు చెప్పేవారిని, చెడు ఉద్దేశ్యంతో ఉండేవారికి శని అనేక సమస్యలను సృష్టిస్తాడు. మీరు తప్పుడు పనులు చేసి సంపాదించిన డబ్బును శని ఒక్క క్షణంలో లాగేసుకుంటాడు. శని మహాదశ సమయంలో ఎవరైతే చెడు పనులు చేస్తారో వారిని శని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తాడు. అందుకే పేదవారిని, నిస్సహాయ ప్రజలను, జంతువులను ఎప్పుడూ వేధించకండి. 


Also Read: Dhanteras 2022: ధంతేరాస్‌ నాడు శని సంచారం.. కుబేరుడు ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook