Shani Dev Uday 2023:  వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మారుస్తాయి. దాదాపు ఏడాది తర్వాత శనిదేవుడు ఫిబ్రవరిలో ఉదయించబోతున్నాడు. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. శనిదేవుడి సంచారం (Shani Gochar 2023) వల్ల మూడు రాశులవారు అపారమైన సంపదను పొందనున్నారు. వీరు కెరీర్ లో అపారమైన పురోగతిని సాధించనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులా రాశిచక్రం (Libra): శని దేవుడి ఉదయం తుల రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి ఐదో ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీంతో మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. సంతానం లేని దంపతులు పిల్లలకు కలుగుతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. 


వృషభ రాశి (Taurus): శనిదేవుడు ఉదయం వృత్తి మరియు వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మీ రాశి నుండి పదో ఇంట్లో ఉదయించబోతున్నాడు. మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. మీరు మీ రంగంలో పురోగమిస్తారు. ఉద్యోగస్తులకు జూనియర్ మరియు సీనియర్ల మద్దతు లభిస్తుంది. చమురు, ఇనుము, పెట్రోలియం వ్యాపారం చేసే వారికి ఈ సమయం బాగుంటుంది. 


వృశ్చిక రాశిచక్రం (Scorpio): శని దేవుడి సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీని కారణంగా మీరు వ్యాపారంలో రెట్టింపు లాభాలను పొందుతారు. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా లాభపడతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 


Also Read: Budh Gochar 2023: శనిదేవుడి రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.