Shani Vakri 2023 effect: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల కదలిక ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. మెుత్తం నవగ్రహాలలో శనిదేవుడిని కర్మ దాత, న్యాయదేవుడుగా పిలుస్తారు. అన్ని గ్రహాల్లో కెల్లా శని నెమ్మదిగా కదులుతుంది. ఇతడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో అంటే జూన్ 17, 2023 రాత్రి 10.48 గంటలకు అదే రాశిలో తిరోగమనం చేయనున్నాడు. నవంబర్ 4 వరకు శని అదే దిశలో కదులుతాడు. శని వక్రీ కారణంగా కొన్ని రాశులవారికి సమస్యలు పెరగనున్నాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి
ఇదే రాశిలో శనిదేవుడు తిరోగమనం చెందనున్నాడు. అంతేకాకుండా ఇది మీపైనే ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. మీరు శారీరక మరియు మానసిక సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. మీ కెరీర్ నత్తనడకన సాగుతోంది.
తులారాశి
శని వక్రీ మీకు కష్టాలను పెంచుతుంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపారులు నష్టపోతారు. ఉద్యోగులకు కూడా ఈ సమయం అస్సలు కలిసిరాదు.
మేషరాశి
కుంభరాశిలో శని తిరోగమనం వల్ల మేష రాశి వారికి సమస్యలు పెరుగుతాయి. మీ పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. భారీగా డబ్బు నష్టపోతారు. దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. 


Also Read: Budh Ast 2023: రేపటి నుండి ఈ 3 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?


వృషభం
తిరోగమన శని మీ రాశి యెుక్క పదవ ఇంటిని ప్రభావితం చేస్తుంది. దీంతో రాబోయే రోజులన్నీ కష్టాలతో నిండి ఉంటాయి. ఆఫీసులో మీకు ప్రెషర్ ఉంటుంది. వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూస్తారు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. 
కర్కాటక రాశి
కర్కాటక రాశిపై శని సడేసతి నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో శని తిరోగమనం ఈ రాశి వారికి మంచిది కాదు. దీంతో వీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఇతరులతో గొడవలు అవుతాయి. ధన నష్టం ఉంటుంది.


Also Read: Venus transit 2023: జూలై 7న సింహరాశిలోకి శుక్రుడు.. ఈ 2 రాశులకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook