Shani uday before holi 2023: మనం చేసే పనులు ఆధారంగా ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. శని గ్రహం యెుక్క రాశిలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మరో మూడు రోజుల్లో అంటే మార్చి 06, రాత్రి 11.36 గంటలకు కుంభరాశిలో ఉదయించబోతుంది. శని గ్రహం యెుక్క ఈ గమనంలో మార్పు వల్ల కొందరి కెరీర్ కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం- శని యెుక్క రాశి మార్పు మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. 
వృషభం - కర్మలను ఇచ్చే శనిదేవుడు వృషభ రాశి వారికి అనేక లాభాలను ఇవ్వనున్నాడు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. మీకు ఉద్యోగంలో ఉన్నతాధికారుల సపోర్టు లభిస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యక్రమం జరిగే అవకాశం ఉంది. 
మిథునరాశి - శని ఉదయించడం వల్ల మిథునరాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మీకు ఐశ్వర్యం పెరుగుతాయి. 
కన్య - కన్యా రాశి వారికి శని ప్రభావం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. ఉపాధి మెరుగుపడుతుంది. పని నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లవచ్చు. చదువులపై ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. 
ధనుస్సు - ధనుస్సు రాశి వారి శుభవార్త వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఈ సమయంలో మీరు పెట్టుబడిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. 


Also Read: Gajlaxmi Rajyog 2023: హోలీ తర్వాత ఈ రాశులకు మహర్దశ.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook