Saturn Transit 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శని. ఎవరి జాతకంలో శనిదేవుడు శుభ స్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. మరో 10 రోజుల్లో అంటే జనవరి 17న శనిదేవుడు మకరరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. శనిదేవుడు 2025 సంవత్సరం వరకు కుంభరాశిలోనే ఉంటాడు. శని సంచారం వల్ల కొన్ని రాశుల వారిపై శని సడేసతి ముగిస్తే.. మరికొందరిపై ప్రారంభమవుతుంది. ఆస్ట్రాలజీలో అత్యంత ప్రమాదకరంగా భావించే సాడేసతి రెండో దశ కుంభ రాశి వారిపై మెుదలుకానుంది. దీని వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి (Aquarius): కుంభరాశిలో శని సంచారంతో ఈ రాశి వారికి రెండవ దశ సాడే సతి ప్రారంభమవుతుంది. సడే సతి యొక్క రెండో దశ అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో మీరు మానసికంగా, ఆర్థికంగా మరియు శారీరకంగా బాధపడతాడు. పోటీపరీక్షలకు, ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యే వక్తులు తమ లక్ష్యం నుండి తప్పుకుంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. లైఫ్ పార్టనర్ తో విభేదాలు పెరగవచ్చు. ఇది మీ సంబంధంపై చెడు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వివాహంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. కుంభ రాశికి శని అధిపతి కాబట్టి మీకు బాధ అంతగా ఉండదు. కొన్నిసార్లు లాభాలు కూడా పొందే అవకాశం ఉంది. సాడే సతి లేదా ధైయా సమయంలో శనిదేవుడు మీ జాతకంలో అశుభ స్థానంలో ఉంటే వారు ఎక్కువగా ఇబ్బందులను  ఎదుర్కొంటారు. 


Also Read: Venus Gochar 2023: కుంభరాశిలో శుక్ర గోచారం.. త్వరలో వీరికి గోల్డెన్ డేస్ మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U     


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.