2023 ప్రారంభమవుతూనే..ప్రతి ఒక్కరికీ కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంటుంది. కొత్త ఏడాదిలో గ్రహాల స్థితి వ్యక్తికి అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త ఏడాది మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. కొత్త ఏడాది జాతకం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఎవరి రాశి ఫలాలు ఎలా ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొత్త ఏడాదిలో శని స్థితి కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కొందరికి అనుకూలంగా మరికొందరికి ప్రతికూలంగా ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభంలో శని పరివర్తనం జరగనుండటంతో..అందరికీ ఆసక్తి పెరుగుతోంది. 


శని రాశి పరివర్తనం కారణంగా కొన్ని రాశుల జాతకాలపై కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో శని కోపం నుంచి కాపాడుకునేందుకు నష్టం కలగకుండా ఉండేందుకు కొన్ని విషయాలు తప్పకుండా పరిశీలించాలి. శనిని శాంతింపజేసేందుకు జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని ఉపాయాలు కూడా ఉన్నాయి. 2023లో ఏ రాశి జాతకులు అప్రమత్తంగా ఉండాలి, శని ప్రకోపం నుంచి కాపాడుకునేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..


శని రాశి పరివర్తనం ఎప్పుడు


హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని మకరరాశి నుంచి బయటికొచ్చి కుంభరాశిలోకి 2023 జనవరి 17న ప్రవేశించనున్నాడు. అన్ని గ్రహాల్లో శని గ్రహమే అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. ఈ క్రమంలో జనవరి 17న కుంభరాశి గోచారం తరువాత 2024లో శని మరే రాశి మారదు. ఆ తరువాత 2025లో అంటే మార్చ్ 29న శని మీనరాశిలో ప్రవేశించనున్నాడు.


ఏ రాశులవాళ్లు జాగ్రత్తగా ఉండాలి


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం గోచారం లేదా వక్రమార్గం పట్టేటప్పుడు ఆ ప్రబావం అన్ని రాశుల జీవితాలపై పడుతుంది. శనిగ్రహం జనవరి 17న కుంభరాశిలో గోచారం చేయనున్నాడు. ఈ క్రమంలో మకరం, కుంభరాశుల జీవితంలో కష్టాలు భారీగా పెరగనున్నాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా ఇతరుల్ని నిందించకుండా ఉంటే మంచిది. అటు కుంభరాశి వారికి సాడే సతి రెండవ దశలో ఉంటుంది. ఈ జాతకులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కోపం, అహంకారం దూరంగా పెట్టాలి.


శని ప్రకోపం నుంచి కాపాడుకునేందుకు ఏం చేయాలి


ఈ సందర్భంగా ఎవరికీ అప్పుడు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయవద్దు. మహిళల్ని గౌరవించాలి. శని చాలీసా పఠించడం వల్ల ప్రయోజనాలుంటాయి. శని ప్రకోపం నుంచి కాపాడుకునేందుకు శని మంత్రం జపించాలి. శని అశుభ ప్రభావాల్నించి కాపాడుకునేందుకు శనివారం నాడు శనీశ్వరాలయంలో ఆవాల నూనెతో దీపం వెలిగించాలి.


Also read: Betel Leaves Vastu Tips: తమలపాకులతో ఈ చిన్న పనిచేస్తే.. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది! ఊహించని డబ్బు మీ సొంతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook