Saturn transit: 2025 వరకు ఈ 3 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది.. ఇందులో మీది ఉందా?
Saturn transit 2023: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో రెండున్నర సంవత్సరాలు పాటు ఉండనున్నాడు. శని సంచారం వల్ల మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Shani Margi 2023 effect: అన్ని గ్రహాల్లోకెల్లా శని నెమ్మదిగా కదులుతుంది. శని గ్రహం ఒక రాశి నుండి మరోక రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో శని కుంభరాశిలోకి ప్రవేశించింది. ఇదే రాశిలో 2025 వరకు ఉండనుంది. శని మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇస్తాడు, అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. రెండున్నర సంవత్సరాల పాటు శని కుంభరాశిలో ఉండటం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
కుంభ రాశి
2025 వరకు శనిదేవుడు ఇదే రాశిలో ఉంటాడు. కుంభరాశిలో శని సంచారం వల్ల శష్ అనే రాజయోగం ఏర్పడుతోంది. దీంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలతోపాటు పరిచయాలు కూడా పెరుగుతాయి. లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. మీరు కోర్టు కేసుల్లో గెలుస్తారు. మీరు డబ్బును భారీగా పొదుపు చేస్తారు.
మిధునరాశి
శని సంచారం మిథునరాశి వారికి వరమనే చెప్పాలి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆఫీసులో ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
తులారాశి
శనిదేవుడి రాశి మార్పు తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ఊహించని లాభాలను పొందుతారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Planet Conjunction: ఒకే రాశిలో 3 క్రూర గ్రహాల కలయిక.. ఈ 5 రాశులకు బ్యాడ్ టైమే ఇక..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook