Shani Gochar 2023: సంక్రాంతి తర్వాత మూడు రాశుల వారికి చెప్పలేనంత డబ్బు.. ఇందులో మీరున్నారా?
Shani Gochar 2023: శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా 3 రాశిచక్రాల ప్రజలు ఆర్థికంగా లాభపడనున్నారు.
Saturn Planet Gochar In Aquarius 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల రాశి మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. జనవరి 17న శనిదేవుడు తన త్రిభుజరాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించబోతుంది. కుంభరాశిలో శనిదేవుడు సంచారం (Saturn transit in Aquarius 2023) మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో లాభాలు మరియు పురోభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
శనిదేవుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం (Aries): కుంభరాశిలో శని సంచారం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశికి అధిపతి అంగారకుడు ధనవంతుల గృహంలో ఉన్నాడు. దీంతో మీకు అనుకోకుండా డబ్బు వస్తుంది. దీనితో పాటు శని దేవుడు మీ రాశి నుండి లాభ స్థానంలో కదులుతాడు. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. విదేశాల్లో వ్యాపారం చేసే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. రాహు గ్రహం మీకు కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది, కానీ ఏప్రిల్‌లో బృహస్పతి గ్రహం సంచరించిన వెంటనే మీరు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
వృషభ రాశి (Taurus): శని యొక్క సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీ అదృష్ట స్థానంలో కూర్చున్నాడు. అందుకే శుక్రుడు మీకు ధనలాభం కలిగిస్తాడు. అంతేకాకుండా అదృష్టం మీవెంటే ఉంటుంది. అంతేకాకుండా శనిదేవుడు మీ సంచారం జాతకంలో శష్ అనే రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు విజయం సాధిస్తారు. దేవగురు మీ యెుక్క లాభస్థానంలో ఉన్నాడు. దీంతో మీరు పెట్టుబడి పెట్టడం వల్ల లాభం పొందుతారు.
ధనుస్సు రాశిచక్రం (Sagittarius): శని సంక్రమించిన వెంటనే ధనుస్సు రాశి వారికి సడే సతి నుండి విముక్తి లభిస్తుంది. పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. మరోవైపు ధనుస్సు రాశికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి మీ సంచార జాతకానికి సంబంధించిన ఆనందం మరియు మార్గాలలో కూర్చున్నాడు. దీంతో మీరు ఏప్రిల్ నెల లోపే మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు పోటీ చేయవచ్చు. అంతేకాకుండా మీ జాతకంలో హన్స్ అనే రాజయోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా శక్తి యెుక్క అధిపతి అయిన శనిదేవుడు మూడో ఇంట్లో ఉంటాడు. మీలో ధైర్యం మరియు శక్తి పెరుగుతాయి. విదేశాల నుంచి ధనాన్ని ఆర్జిస్తారు. కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.
Also Read: Budhaditya Rajyog 2023: శనిదేవుడి రాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ 3 రాశులకు తిరుగులేనంత అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook