Shani Sadhe sati: మనం చేసే పనులను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని కర్మదాత, న్యాయదేవుడు అని అంటారు. మనం మంచి పనులు చేస్తే శని తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు. అదే చెడు పనులు చేస్తే మనల్ని కఠినంగా శిక్షిస్తాడు. శనిదేవుడు (Shani Dev) తన రాశిచక్రాన్ని మార్చినప్పుడల్లా, కొన్ని రాశులవారికి శనిమహాదశ నుండి విముక్తి లభిస్తుంది. అదే సమయంలో మరికొన్ని రాశులవారిపై శని సడేసతి, ధైయా ప్రారంభమవుతుంది. వచ్చే జనవరి నుండి కొన్ని రాశులవారు సడే సతి, ధైయా నుండి ఉపశమనం పొందబోతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడు ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబర్ 23న అతడు మార్గంలోకి వస్తాడు. అదే స్థితిలో జనవరి 17, 2023 వరకు ఉంటాడు. దీని తర్వాత శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. కుంభరాశిలో ప్రవేశించిన వెంటనే శని గ్రహం యొక్క ధైయా మరియు సడే సతి కొందరిపై ముగిసి..మరికొందరిపై ప్రారంభమవుతుంది. 


వీరికి విముక్తి, వారికి ప్రారంభం...
జనవరి 17, 2023 తర్వాత మిథునం, తుల రాశుల వారికి శని దైయా నుండి విముక్తి లభిస్తుంది. అదే సమయంలో ధనుస్సు రాశివారిపై సడేసతి ముగుస్తుంది. జనవరి 2023లో శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించడంతో మీన, మకర, కుంభ రాశుల వారిపై శని సడే సతి ప్రారంభమవుతుంది. కర్కాటకం, వృశ్చిక రాశులవారిపై శని యెుక్క ధైయా స్టార్ట్ అవుతుంది. 


Also Read: Jupiter Closure: ఆకాశంలో అద్భుతం, 60 ఏళ్ల తరువాత భూమికి అతి చేరువలో గురుగ్రహం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook