Lucky Zodiac Signs: న్యూ ఇయర్ లో అరుదైన యోగం.. 2024లో ఈ 4 రాశులవారికి గవర్నమెంట్ జాబ్ పక్కా..
Shani ketu Gochar 2024: కొత్త సంవత్సరంలో శని మరియు కేతు గ్రహాలు కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారు ధనవంతులు కాబోతున్నారు.
Benefits of Shadashtak Yog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో సంయోగం జరుపుతాయి. 2024లో కూడా కొన్ని గ్రహాలు వేరే గ్రహాలతో పొత్తులు పెట్టుకోనున్నాయి. ఛాయా గ్రహమైన కేతువు నెలన్నరకు ఒకసారి రాశిని మారుస్తాయి. వచ్చ ఏడాది కేతువు కన్యారాశిలో సంచరించబోతున్నాడు. ఇదే సమయంలో శని గ్రహం కుంభరాశిలో ఉంటుంది. ఈ రెండింటి స్థానం షడష్టక యోగాన్ని ఏర్పరుస్తోంది. ఈ యోగం వల్ల కొత్త సంవత్సరంలో ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
కన్యా రాశి
2024లో శని మరియు కేతువుల కలయిక వల్ల కన్యారాశి వారు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో తనదైన ముద్రను వేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఫైనాన్సిషయల్ బాగుంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు.
తులరాశి
షడష్టక్ యోగం ప్రభావం వల్ల తులా రాశి వారు వచ్చే ఏడాది బంపర్ బెనిఫిట్స్ పొందుతారు. జాబ్ లేని వారికి ఉద్యోగం, ప్రమోషన్ రాని వారికి ప్రమోషన్ వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తవుతాయి. ప్రతి విషయంలో మీకు లక్ కలిసి వస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది.
వృషభరాశి
శని, కేతు గ్రహాల కలయిక వల్ల ఏర్పడిన షడష్టక యోగం వృషభ రాశి వారికి న్యూ ఇయర్ లో చాలా లాభాలను ఇవ్వనుంది. ఈ రాశి వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది.
సింహ రాశి
కొత్త సంవత్సరంలో సింహరాశి వారి సమస్యలన్నీ తీరిపోతాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాది దొరుకుతుంది.
Also Read: Zodiac Signs: లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది.. డిసెంబర్ 31 నుంచి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook