Shani Margi 2022 Effect: మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. మంచి పనులు చేస్తే శుభఫలితాలు, తప్పుడు పనులు చేస్తే శిక్షలు వేస్తాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాతగా పరిగణిస్తారు. శని అనుగ్రహం ఎవరిపై ఉంటుందో ఆ వ్యక్తి లైఫ్ బిందాస్ గా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడు మకరరాశికి అధిపతి. శని మహారాజు ప్రస్తుతం మకరరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. అక్టోబరు 23న అంటే ధంతేరాస్ రోజున శనిదేవుడు తిరోగమనం నుండి ప్రత్యక్ష సంచారంలోకి వస్తాడు. ఏదైనా గ్రహం రివర్స్ లో కదులుతుంటే అది అశుభఫలితాలను ఇస్తుంది. అయితే శని యెుక్క  మార్గం(Shani Margi in Capricorn 2022) వల్ల మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


శని ప్రత్యక్ష సంచారం ఈ రాశులవారికి శుభప్రదం
మేషరాశి (Aries): శని దేవుడి ప్రత్యక్ష సంచారం కారణంగా మేష రాశివారిపై శుభ ప్రభావం ఉంటుంది. వీరికి లక్ కలిసి వస్తుంది. ఈ రాశికి చెందిన వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. ఇంట్లో ఏ శుభ కార్యమైనా జరిగే అవకాశం ఉంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహంమీపై ఉంటుంది. 
ధనుస్సు రాశి (Sagittarius): శని దేవుడి మార్గం వల్ల ధనుస్సు రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ప్రియమైనవారి మద్దతు మరియు ప్రేమను పొందుతారు. తద్వారా మీ లైఫ్ సంతోషంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బ్రహ్మచారులు వివాహం చేసుకునే అవకాశం ఉంది. చిక్కుకుపోయిన లేదా అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  
మీన రాశి (Pisces): మీన రాశి వారికి శని మార్గంలో ఉండటం వల్ల చాలా లాభం చేకూరుతుంది. ఈ సమయంలో మీకు డబ్బుకు లోటు ఉండదు. మీరు కొత్త జాబ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఉద్యోగంలో బాస్ మీ పని పట్ల సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో పెద్ద డీల్ ఫైనలైజ్ కావచ్చు.  కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే వారికి అక్టోబర్ 23 తర్వాత సరైన సమయం. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి.  మీరు జీవితంలో చాలా పురోగతిని సాధిస్తారు.


Also Read: Shani Dev: ఈ నెలలో శని ప్రత్యక్ష కదలిక.. ఈ రాశులవారికి ఇబ్బందులు.. ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి