Shani Gochar 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏ గ్రహం యొక్క రాశిచక్రంలో మార్పు అయినా సరే ప్రజల జీవితాలపై మార్పు చూపుతుంది. జూలై నెల నుంచి మకరరాశిలో తిరోగమనంలో ఉన్న శనిదేవుడు ఈనెల 23న ప్రత్యక్ష  సంచారంలోకి వచ్చాడు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు శనిదేవుడు అదే స్థితిలో ఉంటాడు. మనం చేసే పనులను బట్టి ఫలాలను ఇస్తాడు శనిదేవుడు.ఆస్ట్రాలజీలో శనిదేవుడిని (Shani Dev) క్రూరగ్రహంగా, పాపగ్రహంగా పరిగణిస్తారు. శనిదేవుడు కోపానికి ఎవరు గురవుతారో వారి పతనం ప్రారంభం కావడానికి ఎంతో సమయం పట్టదు. శనిదేవుడి మార్గం వల్ల కొన్ని రాశులవారికి బ్యాడ్ డేస్ ప్రారంభంకానున్నాయి. శనిగ్రహ ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు ఈ రోజున కొన్ని చర్యలు తీసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారిపై శని మార్గి దుష్ప్రభావం
వృశ్చికం (Scorpio)- మకరరాశిలో శని సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. దీని కారణంగా తోబుట్టువులతో సంబంధాలు చెడిపోతాయి. అందుకే వారితో గొడవలకు దూరంగా ఉండండి. ఉద్యోగ, వ్యాపారులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. 
ధనుస్సు (Sagittarius)- జ్యోతిష్యశాస్త్రం  ప్రకారం, ఈ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆర్థికంగా మెరుగుపడతారు. ఫ్యామిలీలో ఒడిదుడుకులు ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. 
కుంభం (Aquarius)- ఈ రాశి వారు జనవరి వరకు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే శనిదేవుడు మీ ఆర్థిక పరిస్థితిని దిగజార్చవచ్చు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి. ఆఫీసులో సహోద్యోగులతో గొడవలకు దూరంగా ఉండండి. 
మకరం (Capricorn) - అక్టోబర్ 23న శని మకరరాశిలో సంచరిస్తున్నాడు. ఈ వ్యక్తులపై శని యొక్క సడేసతి కొనసాగుతోంది. ఈ సమయంలో వీరు శారీరక, మానసకి సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. దీంతోపాటు వీరి ఖర్చులు కూడా పెరుగుతాయి.  


శనిదేవుడి పరిహారాలు
>> శనివారం నాడు శని దేవాలయానికి వెళ్లి ఉదయం, సాయంత్రం ఆవనూనె సమర్పించండి.
>> శనివారం నీడను దానం చేయండి. దీని కోసం కాంస్య గిన్నెలో ఆవాల నూనెతో నింపి, అందులో మీ ముఖాన్ని చూడండి. దీని తరువాత గిన్నెతో పాటు పేద వ్యక్తికి దానం చేయండి లేదా శని ఆలయంలో ఉంచండి.
>> జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనివారం నాడు పీపల్ చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవనూనె దీపాన్ని వెలిగించండి.
>> శనివారం రోజున హనుమంతుడిని ఆరాధించండి.


Also Read: Nagula Chavithi 2022: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి