Shani Dev: ఈ 5 రాశుల వారిపై శనిదేవుని అనుగ్రహం... జనవరి 17 వరకు వీరికి డబ్బే డబ్బు..
Shani Dev: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు.
Shani dev Gochar 2022: ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో ప్రత్యక్ష సంచారంలో ఉన్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దేవుడు జనవరి 17, 2023 వరకు అదే స్థితిలో ఉంటాడు. దీని ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది. సాధారణంగా శనిదేవుడి కదలిక ఇతర గ్రహాల కంటే నెమ్మదిగా ఉంటుంది. మనిషి చేసే కర్మల ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడు శని. శనిదేవుడు మార్గంలో (Shani Dev Gochar 2022) ఉండటం వల్ల కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మిధునరాశి (Gemini): ఈ రాశి యెుక్క ఎనిమిదవ మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతి శనిదేవుడు. ఈ రాశి యెుక్క జాతకంలో ఎనిమిదో ఇంట్లో శనిదేవుడు సంచరించనున్నాడు. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందుతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.
సింహరాశి (Leo): సింహ రాశి యెుక్క ఆరు మరియు ఏడవ గృహాలకు శని దేవుడు అధిపతి. మీ జాతకంలో, ఆరవ ఇంట్లో శనిదేవుడు సంచరించనున్నాడు. దీంతో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు.
తులారాశి (Libra): ఈ రాశి వారి జాతకంలో శని దేవుడు నాల్గవ ఇంట్లో ఉంటాడు. ఈరాశివారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. మీరు వాహనం కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం బాగుంటుంది.
మకరరాశి (Capricorn): ఈ రాశి వారికి శనిదేవుడు లగ్నానికి మరియు రెండవ ఇంటికి అధిపతి. శనిదేవుడు మకరరాశిలో మాత్రమే ఉన్నాడు. దీంతో ఈరాశివారు అనేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆఫీసులో మీకు తగిన మద్దతు లభిస్తుంది.
మీనరాశి (Pisces): ఈ రాశి వారికి ఎదురయ్యే అడ్డంకులు చాలా వరకు అధిగమిస్తారు. న్యాయశాస్త్రం మొదలైనవాటిని అభ్యసిస్తున్న వ్యక్తులకు శని దేవుడి మార్గం నుండి ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి.
Also read: Grah Gochar 2022: వృశ్చికంలో 3 పెద్ద గ్రహాల సంచారం.. ఈ 4 రాశుల వారు ధనవంతులవ్వడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook