Shani Margi 2022: మార్గి శని ఎఫెక్ట్.. ఈ 2 రాశులవారి అదృష్టం అదుర్స్..!
Shani Dev Margi 2022: ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. వచ్చే నెలలో మార్గంలోకి వస్తాడు. మార్గి శని కారణంగా రెండు రాశులవారు భారీగా లాభపడనున్నారు.
Shani margi 2022 Effect on Zodiac Sign: కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. శని వక్ర దృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం సర్వనాశనమవుతుంది. శనిదేవుడు అనుగ్రహం బిచ్చగాడిని కూడా బిలియనీర్ చేస్తుంది. ఆస్ట్రాలజీలో శనిదేవుడి సంచారం మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం శనిగ్రహం తన సొంతరాశి అయిన మకరరాశిలో తిరోగమనంలో ఉంది. అక్టోబరు 23 నుంచి శని మార్గంలో (Shani margi 2022) ఉంటాడు. వచ్చే ఏడాది జనవరి 17వరకు అదే స్థితిలో శని గ్రహం ఉంటుంది. ఇది రెండు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి మార్గి శని శుభఫలితాలు
మేషం (Aries): మకరరాశిలో శని సంచారం మేషరాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. కెరీర్ లో విజయం సాధిస్తారు. ఈరాశివారికి అదృష్టం మెండుగా ఉంటుంది. జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది.
ధనుస్సు (Sagittarius): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దేవుడు ధనుస్సు రాశిలో రెండో స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశివారు అపారమైన ప్రయోజనాన్ని పొందుతారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఊహించని ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. జీతం పెరుగుతుంది. ఈ సమయం వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు భారీ లాభాలను ఆర్జిస్తారు.
Also Read: Guru Vakri 2022: మీనంలో త్రికోణ రాజయోగం... ఈ 3 రాశులవారికి అంతులేని ధనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook