Shani Margi 2022 Imapct: గ్రహాలు, రాశుల కదలిక ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. గ్రహాల సంచారం వల్ల 12 రాశుల వారి జీవితాల్లో శుభ, అశుభ ప్రభావం కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా తిరోగమన దశలో అన్ని రాశుల వారు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే శని దేవుడు అక్టోబర్ 23న మకరరాశిలో గ్రహ సంచారం చేశారు. దీని ప్రభావం జనవరి 17, 2023 వరకు దాకా ఉండే అవకాశాలున్నాయి. తిరోగమన దశలో ఉన్నప్పుడు శని ధనిష్ట నక్షత్రంలో ఉంటాడు. అయితే దీని వల్ల అన్ని రాశులవారికి  శుభ యోగాలు కలుగబోతున్నాయి. కాబట్టి ఏ రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశువారికి ప్రయోజనాలేనా..?:
మకర రాశి:

అక్టోబర్ 23 న శని మకరరాశిలోకి ప్రవేశించింది. దీని ప్రభావవం అన్ని రాశులపై పడబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే పలు కారణాల వల్ల మకర రాశి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ క్రమంలో తీరుతాయని సమాచారం. ఈ సంచారం వల్ల నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తిరోగమనం వల్ల శని దేవున్ని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.


కుంభ రాశి:
ఈ తిరోగమన దశ కుంభ రాశి వారికి శని అర్ధ శతాబ్ది ప్రభావం ఉండబోతోంది. శని మార్గంలో ఉండటం వల్ల కుంభ రాశి వారికి అన్ని రకాల సమస్యలు తీరుతాయి. అంతేకాకుండా మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం వెతుకుతున్నవారికి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఈ క్రమంలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.


తుల రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రాశి వారికి కూడా శని ధైయ ప్రభావం ఉండబోతోంది. శని మార్గంలో ఉండటం వల్ల ఈ రాశువారు గొప్ప ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ నెలలో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సహకారంతో ఏదైనా గొప్ప పని చేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది.. మరో రికార్డుకు చేరువలో..   


Also Read: YSRCP MLA Tears: కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. కష్టాలు తెలుసుకుని భావోద్వేగం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook