Shani Margi 2022 effect: సూర్యుడి కుమారుడైన శనిని న్యాయ దేవుడు అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో, శనికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. ఎందుకంటే శనిదేవుడు కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. శని అనుగ్రహం ఉంటే దరిద్రుడైనా సరే ధనవంతుడిగా మారుతాడు. శని వక్ర దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి బిలియనీర్ అయినా సరే బిచ్చగాడిగా మారుతాడు. ప్రస్తుతం మకరరాశిలో ప్రత్యక్ష సంచారంలో ఉన్నాడు శనిదేవుడు. ఇది నాలుగు రాశులవారికి అననుకూలంగా ఉంటుంది. వీరు వచ్చే ఏడాది జనవరి 17 వరకు అప్రమత్తంగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్గి శని ఈ రాశుల వారికి అశుభం
మిథునరాశి (Gemini)- మార్గి శని మిథునరాశి వారికి శుభప్రదంగా ఉండదు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీరు ఈ సమయంలో సోమరితనాన్ని వీడండి. అత్తమామలతో సంబంధాలు చెడిపోవచ్చు.
వృశ్చికం (Scorpio)- శని మార్గి వృశ్చిక రాశి వారి జీవితంలో కష్టాలను పెంచుతుంది. వారు పని ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో వాదించవద్దు. మీ మాటలను అదుపులో పెట్టుకోండి. ఉద్యోగం-వ్యాపారంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. 
ధనుస్సు (Sagittarius)- మార్గి శని రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. అప్పులు ఎక్కువ అవుతాయి. కాబట్టి డబ్బులు దుబారా చేయకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి.  ఎవరికీ అబద్ధాలు చెప్పకండి.
మకరం (Capricorn)- శని మకరరాశిలో ఉన్నాడు మరియు ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. దీంతో ఈ రాశివారు ఒత్తిడికి గురవుతారు. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. తమ్ముళ్ల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.


శనిగ్రహం యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించే పరిహారాలు: 
>> ప్రతి శనివారం ఆవనూనెను దానం చేయండి.
>> ప్రతి శనివారం పీపుల్ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి.
>> శని మంత్రాలను జపించండి.
>> శని చాలీసా చదవండి.
>> నిస్సహాయులకు, పేదవారికి సహాయం చేయండి. 
>> శుభ్రపరిచే సిబ్బందితో గౌరవంగా మాట్లాడండి.
>> కుక్కకు ఆహారం పెట్టండి.


Also Read: Shukra Gochar 2022: వృశ్చికరాశిలోకి శుక్రుడు... నవంబర్ 11 నుండి ఈ రాశులకు డబ్బే డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U    


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook