Shani Margi 2022:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం సంచరించినప్పుడల్లా.. దాని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. మనం చేసే మంచి, చెడులను బట్టి ఫలాలను ఇస్తాడు శనిదేవుడు. అందుకే ఇతడిని కర్మదాత, న్యాయదేవుడు అని పిలుస్తారు. శనిదేవుడు కటాక్షం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శనిదేవుడు చెడు దృష్టి ధనవంతుడిని కూడా దరిద్రుడిగా మారుస్తుంది. మకరరాశిలో తిరోగమనంలో ఉన్న శని..ఇవాళ ప్రత్యక్ష సంచారంలోకి (Shani Margi 2022) వచ్చాడు. దీంతో కొన్ని రాశులవారికి మంచి రోజులు మెుదలయ్యాయి. రాబోయే మూడు నెలలు ఈరాశులపై డబ్బు వర్షం కురవనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని ప్రత్యక్ష సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి (Aries): శనిమార్గి మేషరాశి వారికి చాలా స్పెషల్ గా ఉండనుంది.  వీరి అదృష్టం ప్రకాశించనుంది.  ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. అదృష్టం కలిసి వచ్చి మీరు ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
మిధునరాశి (Gemini): ఈ రాశి వారికి శని అనుగ్రహం కూడా లభిస్తుంది. వీరు చాలా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందుతారు. పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
కర్కాటకం (Cancer): ఈ రాశి వారిని శనిదేవుడు ధనవంతులను చేయనున్నాడు. శని ప్రభావం వల్ల కర్కాటక రాశి వారి జీవితంలో సంతోషం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుండి కూడా మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius): శని ప్రత్యక్ష సంచారం ధనుస్సు రాశి వారికి చాలా లాభాలను ఇవ్వబోతోంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆఫీసులో మీ పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. సమాజంలో గౌరవం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. 
మీనరాశి (Pisces): శని మార్గంలో ఉండటం వల్ల మీనరాశివారు శుభఫలితాలను పొందనున్నారు. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో భారీ లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి.


Also Read: Magh Amavasya 2023: మాఘ అమావాస్య ఎప్పుడు, శుభముహూర్తం, పూజ విధానం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook