Shani Margi 2022: కర్మల ప్రకారామే శని దేవుడు మంచి ఫలితాలను ఇవ్వ గలుగుతాడు. అయితే చాలా మంది శని దేవుడి చెడు ప్రభావంతో సతమతవుతూ ఉంటారు. దీని కారణంగా చాలా మంది ధన నష్టాలు, జీవితంలో అసంతృప్తి పొందుతారు. అయితే ఈ దేవున్ని పూజించడం వల్ల మంచి పరిణాలు వస్తాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం ప్రతి శనివారం శని దేవునికి పూజలు చేయాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..శనిదేవుడు మకరరాశిలో సంచరించనున్నాడు. ఈ సంచారం అక్టోబరు 23న జరగునుంది. దీంతో పలు రాశుల్లో తీవ్ర మార్పులు రాబోతున్నాయి. కొన్ని రాశుల వారికి ఈ సంచారం వల్ల తీవ్ర నష్టాలు జరుగుతాయని సమాచారం.  అయితే ఇంకొన్ని రాశుల వారు మంచి ఫలితాలను పొందగలుగుతారు. అయితే ఏ రాశులపై దీని ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులపై ప్రభావం:
>>మేష రాశి వారికి శని సంచారం వల్ల మంచి గడియలు రాబోతున్నాయి. వీరుపై సమాజంలో గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ రాశివారు భవిష్యత్‌లో మంచి లాభాలు పొందగలుగుతారు. ఈ  మేష రాశి వారిలో వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారంలో భాగస్వామ్యం కోసం ప్లాన్ చేసే వ్యక్తులకు ఇది మంచి సమయం. ఉద్యోగాల కోసం చూస్తున్న వ్యక్తులు ఉద్యోగం కూడా పొందగలుగుతారు. పెట్టుబడులు పెట్టివారు మంచి ప్రయోజనాలు పొందుతారు.


>>శనిదేవుడు కర్కాటక రాశిలో 7వ రోజునా సంచరిస్తాడు. దీంతో కర్కాటక రాశి వారి కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీరి పట్ట గౌరవం విపరీతంగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.


>>దీని ప్రభావం తులారాశిపై కూడా పడబోతున్నది.  శనిదేవుని సంచారం జరగడం వల్ల తుల రాశి వారికి ఆదాయంలో మంచి లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి ఆర్థిక పురోగతికి అవకాశాలు ఉంది. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.


>>శనిదేవుని సంచారం వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ప్రభావం చూపబోతోంది. ముఖ్యంగా ఈ రాశుల వారు పెట్టుబడులు పెట్టాలనుకుంటే తప్పకుండా పెట్టొచ్చు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సంతోషాలు కూడా పొందగలుగుతారు. వీరు ఊహించని శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ రాశివారు కొత్త వాహనాలు కూడా పొందుతారు.


>> మీనరాశి వారి పై కూడా ప్రభావవం పడుతుంది. ఈ రాశి వారు జీవితంలో సంతోషాన్ని కూడా పొందుతారు. మానసిక ఒత్తిడి నుంచి కూడా వీరు ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా వ్యాపారంలో విజయాలు పొందుతారు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నవారు ఇది మంచి సమయంగా భావించవచ్చు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok