Shani Margi 2022: అక్టోబరులో శని యెుక్క `అఖండ సామ్రాజ్య రాజయోగం`.. ఈ రాశులవారికి ఊహించని ధనలాభం!
Shani Grah Margi 2022: అక్టోబరులో శని మార్గం కారణంగా `అఖండ సామ్రాజ్య రాజయోగం` ఏర్పడనుంది. ఈ యోగం మూడు రాశులవారికి ఊహించని ధనలాభం కలుగనుంది.
Akhand Samrajya Raj Yoga: ఆస్ట్రాలజీలో గ్రహాలన్నీ నిర్ణీత కాలం తర్వాత తన రాశిని మారుస్తాయి. ఈ గ్రహాల యెుక్క మార్గం, తిరోగమనం, సంయోగం, దోషం ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతాయి. అక్టోబరు నెల శని మార్గశిర మాసం కాబోతుంది. జూలైలో మకరరాశిలో శని తిరోగమనం చేశాడు. అక్టోబరు నెలలో మార్గంలోకి (Shani Grah Margi 2022) రానున్నాడు. ఈ నేపథ్యంలో శని అఖండ సామ్రాజ్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ యోగ ప్రభావం మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది.
మేషం (Aries): శని దేవుడు మార్గంలో ఉన్నప్పుడు ఏర్పడిన అఖండ రాజయోగం మేషరాశిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ రాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను సాధిస్తారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. మీరు వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. మీరు తలపెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఈ రాజయోగ సమయంలో మీరు నీలం రాయిని ధరించడం వల్ల ప్రయోజనాన్ని పొందుతారు.
మీనరాశి (Pisces): అఖండ సామ్రాజ్య రాజయోగం మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి శనిదేవుడు 11వ స్థానంలో ఉండబోతున్నాడు. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరుల ద్వారా మీరు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనువైన సమయం. ఈ సమయంలో మీరు వ్యాపారం లేదా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు మంచి లాభాలను పొందుతారు. మీరు పుష్యరాగం ధరించడం వల్ల మేలు జరుగుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius): శని తిరోగమనంలో ఉన్నప్పుడు ఏర్పడే యోగం ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. దీంతో ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే, అతను తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారికి లక్ష్మీమాత ఆశీస్సులు కురుస్తాయి. రాజకీయాల్లో ఉన్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఈ టైంలో మణి లేదా పుష్యరాగ రత్నం ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
Also Read: Mangal Gochar 2022: అక్టోబరులో మిథునరాశిలోకి కుజుడు... ఈ 5 రాశులవారి కెరీర్ అదుర్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook