Shani Margi 2022: ఆస్ట్రాలజీలో శనిదేవుడు స్పెషల్ అనే చెప్పాలి. ఇతడి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని వక్ర దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి జీవితం సర్వనాశనమవుతుంది. మనం  చేసే మంచి, చెడులను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని (Shani Dev) న్యాయదేవుడు, కర్మదాత అంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని మహాదశతో బాధపడుతున్న వారు శనివారం శనిదేవుడిని పూజించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే ప్రస్తుతం శనిగ్రహం తన సొంతరాశి అయిన మకరరాశిలో తిరోగమనంలో ఉంది. ఈ నెల 23న శని మార్గంలోకి (Shani Dev Margi in Capricorn 2022) వస్తుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. శని ప్రత్యక్ష సంచారం వల్ల ఏ రాశివారికి లాభం కలుగనుందో, ఎవరికి నష్టం వస్తుందో తెలుసుకుందాం. 


మేషం (Aries)- మేషరాశి వారికి శనిగ్రహం ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే కొత్త వివాదాలు తలెత్తవచ్చు. మీ ఖర్చులు పెరగవచ్చు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.  
సింహరాశి (Leo) - సింహరాశి వారిపై శనిగ్రహం యెుక్క ప్రత్యేక దృష్టి ఉంటుంది. దీంతో మీ బాధ్యతలు పెరుగుతాయి. కెరీర్ లో మంచి అవకాశాలు వస్తాయి. అహంకారాన్ని వీడండి వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇతరులు ఇచ్చే తప్పుడు సలహాలు వల్ల మీకు నష్టాలు రావచ్చు. 
తుల (Libra)- ప్రస్తుతం ఈ రాశివారిపై శనిధైయా కొనసాగుతోంది. అంతేకాకుండా శనిదేవుడికి ఇష్టమైన రాశి తుల. దీంతో విదేశాలకు వెళ్లాలనే వీరి కోరిక నెరవేరుతుంది. బిజినెస్ లో కొత్త డీల్ కుదుర్చుకోవచ్చు. మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. 
మకరం (Capricorn)- ఈ రాశివారిపై శని  సడేసతి నడుస్తోంది. అంతేకాకుండా ఈ రాశిలోనే శని మార్గంలోకి వస్తాడు. దీంతో ఈ రాశివారు సమస్యల నుండి బయటపడతారు. శని ప్రత్యక్ష  సంచారం మీకు లాభాలను ఇస్తుంది. సోమరితనాన్ని వీడితే మీకే మంచిది. మీ కొలిగ్స్ తో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 


Also Read: Surya Gochar 2022: తులరాశిలోకి సూర్యుడు... ఈ 3 రాశుల వారు దీపావళి నాడు ధనవంతులు అవ్వడం పక్కా..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి