Saturn transit 2023: నవంబరు నుంచి ఈ 4 రాశులకు పట్టిన దరిద్రం పోతుంది.. ఇందులో మీ రాశి ఉందా?
Saturn transit 2023: ఈ ఏడాది చివరిలో శనిదేవుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. శని గ్రహం ప్రత్యక్ష సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Shani Margi in November 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. త్వరలో శనీశ్వరుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. రివర్స్ లో కదులుతున్న శని గ్రహం నవంబర్ 4 నుంచి డైరెక్ట్ గా నడవనున్నాడు. శని ప్రత్యక్ష సంచారం వల్ల నాలుగు రాశులవారు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. దీపావళికి ముందు ఈ రాశుల అదృష్టం ప్రకాశించనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహరాశి
శని దేవుడు రాశి మార్పు వల్ల మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. జాబ్ కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతుంది. మీరు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు.
కన్య రాశి
శనిదేవుడు గమనంలో మార్పు కన్యారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మంచి ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. బిజినెస్ చేసేవారు భారీ లాభాలను పొందుతారు. మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు.
వృషభం
నవంబర్‌లో శనిగ్రహం సంచారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగుల జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు.
మిధునరాశి
శని ప్రత్యక్ష సంచారం మిథునరాశి వారికి మేలు చేస్తుంది. దీని కారణంగా మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీరు ఏదైన భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. దీపావళికి ముందు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
Also Read: Planet transit 2023: అక్టోబర్‌లో దశ తిరగనున్న రాశులు ఇవే.. ఇందులో మీది ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి