Saturn direct Movement in November:  మనం చేసే కర్మల ప్రకారం ఫలితాలను ఇచ్చే దేవుడు శని.  అందుకే ఇతడిని న్యాయదేవుడు లేదా కర్మదాత అని పిలుస్తారు. సాధారణంగా శనిదేవుడు మిగతా గ్రహాల కన్నా చాలా నెమ్మదిగా రాశులను మారుస్తాడు. ఇతడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శని గ్రహం 30 ఏళ్ల తర్వాత తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రస్తుతం తిరోగమనంలో ఉన్న శని నవంబరు 04 నుంచి కుంభరాశిలో నేరుగా నడవనున్నాడు. శని ప్రత్యక్ష సంచారం వల్ల నాలుగు రాశులవారు లాభపడనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభం: ఇదే రాశిలో శనిదేవుడు ప్రత్యక్షంగా నడవనున్నాడు. మీకు డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. 
మిథునం: శనిదేవుడు నడవడిక మిథునరాశి వారిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు ప్రమోషన్ దక్కవచ్చు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
వృషభం: కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచారం వృషభరాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగేలా చేస్తుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఉద్యోగులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ సంపద రెట్టింపు అవుతుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
సింహం : శనిదేవుడి గమనంలో మార్పు సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు అన్ని సమస్యల నుండి బయపడతారు. మీ కష్టానికితగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆస్తులు పెరుగుతాయి. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి. దీంతోపాటు మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. 


Also Read: Lucky Zodiac: 2024లో ఈ రాశుల వారికి లాటరీ తగలబోతుంది.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook