Saturn transit 2023: దసరా ముందు నక్షత్రాన్ని మార్చనున్న శనిదేవుడు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..
Saturn transit 2023: శనిదేవుడు త్వరలో తన నక్షత్రాన్ని మార్చనున్నాడు. నవరాత్రికి ఒకరోజు ముందు శనిగ్రహం తన నక్షత్రాన్ని ఛేంజ్ చేయనుంది. దీంతో మూడు రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి.
Shani Nakshatra Change 2023: అష్టగ్రహాల్లో శనిదేవుడు కూడా ఒకరు. పురాణాల ప్రకారం ఇతడిని సూర్యదేవుడిగా పుత్రుడిగా భావిస్తారు. మనలో చాలా మంది శనిదేవుడు అంటే భయపడతారు. ఎందుకంటే అతడు మనల్ని ఎలాంటి బాధలకు గురిచేస్తాడోనని. అయితే ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. వచ్చే అశ్వినీ మాసం మొదటి రోజున అంటే అక్టోబరు 15న శనిదేవుడు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అక్టోబరు నెలలో దీపావళి, దసరా పండుగలు ఉన్నాయి. ఈ పండుగల సమయంలో ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
శని ధనిష్ఠ నక్షత్ర ప్రవేశం వృశ్చిక రాశి వారికి ఊహించని లాభాలను ఇస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ శ్రమకు తగిన పూర్తి ఫలాలను పొందుతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
మేషరాశి
శనిదేవుడు మేషరాశి యెుక్క లాభ స్థానంలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా మీ కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఎవరితోనైనా మనస్పర్థలు తొలగిపోతాయి. పాలిటిక్స్ లో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
మిధునరాశి
మిథునరాశికి యెుక్క తొమ్మిదో ఇంట్లో శని సంచరించబోతున్నాడు. దీంతో మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. జాబ్ నిమిత్తం మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీకు స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: Budh Gochar 2023: అక్టోబరు 1న కీలక పరిణామం.. ఈ 3 రాశుల దశ తిరగబోతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook