హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశి లేదా నక్షత్ర గోచారం చేస్తుంటాయి. దీని ఫలితం అన్ని రాశులపై వివిధ రకాలుగా ఉంటుంది. మార్చ్ 15వ తేదీన శని గ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించనుండటం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం రాహవు నక్షత్రమైన శతభిష మొదటి పాదంలో మార్చ్ 15వ తేదీ ఉదయం 11 గంటల 40 నిమిషాలకు ప్రవేశించనున్నాడు. దీర్ఘకాలం అంటే అక్టోబర్ 23 వరకూ అక్కడే ఉండనున్నాడు. ఆసక్తి కల్గించే అంశమేమంటే..శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు కానీ శని గ్రహం ఎప్పుడూ ప్రతికూలంగా ఉండదు. ఎందుకంటే శనిగ్రహాన్ని కర్మ ఫలదాతగా పరిగణిస్తారు. వ్యక్తి కర్మల్మి బట్టి శని గ్రహం ప్రతిఫలమిస్తాడని నమ్మకం. కొన్ని రాశులపై అత్యంత శుభంగా, మరి కొన్నిరాశులపై ప్రతికూలంగా ఉండనుంది. శతభిష నక్షత్రంలో శనిగోచారం ఏయే రాశులపై శుభ పరిణామాల్ని కలగజేస్తుందో పరిశీలిద్దాం.


మేషరాశి


మేషరాశి వారికి కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు సరైన సమయం. ఇప్పటికే వ్యాపారం చేస్తుంటే..ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. శనిగ్రహం తన మూల త్రికోణ రాశిలో శతభిష నక్షత్రంలో ఉంటాడు. ఫలితంగా మేషరాశివారికి ఆర్ధికంగా లాభాలు కలుగుతాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. 


మిధున రాశి


మిధున రాశి జాతకులు గట్టిగా కష్టపడాలి అవకాశాన్ని వదలకూడదు. కెరీర్ గురించి పరిశీలిస్తే చాలా శుభసూచకంగా ఉంటుంది. చాలాకాలంగా ఉన్నత చదువు, ఉద్యోగం కోసం చూస్తున్నవారికి కోర్కెలు నెరవేరుతాయి.


సింహరాశి


సింహరాశి వారికి శనిగ్రహం నక్షత్ర పరివర్తనం అద్భుతంగా ఉండనుంది. డబ్బుల విషయంలో చాలా లాభాలుంటాయి. శతభిష నక్షత్రంలో శని ఉనికి ఉద్యోగంలో బదిలీలు, విజయానికి కారణమౌతుంది. ఉద్యోగం కోసం వెతికేవారికి గొప్ప అవకాశం లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి శని నక్షత్ర పరివర్తనం లాభం కల్గించనుంది.


తులా రాశి


శని నక్షత్ర పరివర్తనం తులా రాశి జాతకులకు అద్భుత ఫలితాలనిస్తుంది. ఈ సమయం తులా రాశికి చాలా మంచిది. వ్యాపారం చేసేవారికి ఆర్ధికంగా లాభాలు కలుగుతాయి. డబ్బులు సంపాదించేందుకు షార్ట్ కట్ అవలంభించవద్దు. నష్టాలు ఎదురుకావచ్చు. ఆర్ధికంగా బాగున్నా..పరిస్థితుల్ని బేరీజు వేసుకుని ముందుకు సాగాలి. లేకుంటే లేని సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.


ధనస్సు రాశి


శని నక్షత్ర పరివర్తనం ప్రభావంతో మంచి ఉద్యోగం సంపాదిస్తారు. బదిలీ, జీతం పెరగడం ఉంటుంది. ప్రతి రంగంలో మీరు తప్పకుండా రాణిస్తారు. నక్షత్ర గోచారం ఈ రాశివారికి చాలా అదృష్టం కల్గిస్తుంది. చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఊహించని ధనలాభం కలుగుతుంది. 


మకర రాశి


మకర రాశి జాతకులు ఈ సమయంలో మీరు ఏ పని ప్రారంభించినా దీర్ఘకాలం లాభాల్ని ఇస్తుంది. శతభిష నక్షత్రంలో శనిగ్రహం ప్రవేశించడం వ్యాపారులకు లాభాల్ని ఆర్జించిపెడుతుంది. ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవాళ్లు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు మంచి సమయం. అంతటా సానుకూల పరిణామాలు ఎదురౌతాయి.


Also read: Shani Dev: మార్చిలో ఈ 3 రాశులవారు శనిదేవుడి కోపానికి బలి కావాల్సిందే.. ఇందులో మీది ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook