COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani Nakshatra Gochar: ప్రతి నెల గ్రహాలు రాశి సంచారం చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడం కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడడమే కాకుండా కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశిని వదిలి మరొక రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే ఇలా సంచారం చేయడం వల్ల మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని గ్రహం నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 03:04 గంటలకు శతభిష నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికు కూడా నెరవేరుతాయి. అయితే శని నక్షత్రం మారడం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ రాశులవారికి లాభాలు కలుగుతాయి:
మేషరాశి:

శనిగ్రహం శతభిషా నక్షత్రంలో సంచారం చేయడం వల్ల మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 2024 సంవత్సరంలో ఏప్రిల్‌లో ఈ రాశువారికి ప్రతి రంగంలో సానుకూల ఫలితాలు కలుగుతాయి. దీంతో పాటు జీవితంలో ఆనందం కూడా నెలకొంటుంది. అంతేకాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. దీంతో పాటు జీవితం ఆనందంగా ఉంటుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


వృషభ రాశి:
శతభిష నక్షత్రంలో శని గ్రహం సంచారం చేయడం వల్ల వృషభ రాశి వారికి చాలా ఫలప్రదంగా ఉండబోతోంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్‌తో పాటు జీతాలు కూడా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారులు చేసేవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. తల్లిదండ్రుల సపోర్ట్‌తో ఎలాంటి పనులై సులభంగా విజయాలు సాధిస్తారు. 


సింహ రాశి:
సింహరాశి వారికి శని గ్రహం చేసే మార్పుల కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. శని అనుగ్రహంతో కెరీర్‌లో ఊహించని లాభాలు పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటు ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం చాలా చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి