COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani Pradosh Vratam 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన చంద్రగ్రహం మకర రాశిలోకి ప్రవేశించబోతోంది. అలాగే శ్రావణమాసం శుక్లపక్షంలోని త్రయోదశి ప్రత్యేకమైన తిథి కూడా వస్తోంది. ఈరోజు శని దేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ తిథిలో శని ప్రదోష వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం. అలాగే ఈరోజు ఎంతో ప్రత్యేకమైన ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీనికి కారణంగా ఈరోజుకి మరింత ప్రత్యేకత సంతరించుకోబోతోంది. 


ఈ శని ప్రదోష వ్రతం రోజున శని దేవుడితోపాటు ఆ మహా శివుడిని పూజించడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడుతున్న వారికి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఈరోజు వ్రతాన్ని చేసేవారు శని దేవుడి ఆలయాన్ని సందర్శించి ఆయన విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ఎంతో శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో శని దేవుడి అనుగ్రహం కొన్ని రాశుల వారికి లభించి ఊహించని ధనలభాలతో పాటు అదృష్టాన్ని పొందుతారు. ఈ సమయంలో ఏయే రాశుల వారికి శని అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.


వృశ్చిక రాశి: 
వృశ్చిక రాశి వారు శని ప్రదోష వ్రతాన్ని చేయడం వల్ల గతంలో కంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మెరుగుపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబ కలహాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. దీంతోపాటు పూర్వీకుల ఆస్తులు కూడా వీరికి లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎలాంటి పనులు చేసిన విజయాలు పొందే అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు. ఇవే కాకుండా మరెన్నో బోలెడు లాభాలు కలుగుతాయి.


సింహరాశి: 
సింహ రాశి వారికి కూడా ఈ వ్రతం ఆచరించడం వల్ల గతంలో కంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే ఛాన్స్ ఉంది. దీంతోపాటు కొత్త ఆదాయ వనరులు కూడా పంపకు వస్తాయి. ముఖ్యంగా వీరికి ఆలోచనత్మక స్థితి కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా వీరు ఊహించని ఆర్థిక లాభాలు ఉండే ఛాన్స్ ఉన్నాయి. 


కుంభరాశి: 
కుంభ రాశి వారికి కూడా ఈ వ్రతం ఆచరించడం చాలా శుభప్రద మని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనిని ఆచరించడం వల్ల శని దేవుడు అనుగ్రహం లభించి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉన్నతాధికారుల సపోర్టు కూడా లభిస్తుంది. దీని కారణంగా అద్భుతమైన సంపదను పొందుతారు. అలాగే వైవాహిక జీవితంలో కూడా సంతోషం విపరీతంగా పెరుగుతుంది.


ధనస్సు రాశి: 
ధనస్సు రాశి వారికి కూడా ఆగస్టు నెలలోని ప్రదోష వ్రతం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా వీరు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందడమే కాకుండా దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. అలాగే వీరు కొన్ని శుభవార్తలను కూడా వింటారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.