Shani Pradosh 2023:శని సడే సతితో బాధపడుతున్నారా? రేపే ఈ వ్రతాన్ని పాటించండి చాలు
Shani Pradosh Vrat: శని ప్రదోష వ్రతాన్ని పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మేషం, వృశ్చిక రాశికి శని సడే సతి నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అయితే ఏయే నియమాలతో ఈ వ్రతాన్ని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Shani Pradosh Vrat: ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జూలై 15 తేదిన శని ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. అయితే చాలా మంది ఈ శని ప్రదోష వ్రతాన్న రెండవ శివరాత్రిగా కూడా పిలుస్తారు. ఈ వ్రతాన్ని జరుపుకునేవారిలో చాలా గందరగోళం నెలకొంది. చాలా మంది ఈ వ్రతాన్ని శుక్రవారం జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్రతాన్ని శుక్రవారం కాకుండా శనివారం జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్రతంలో భాగంగా శని దేవుడితో పాటు శివుడిని పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సంతాన కోరికలు నెరవేరడమేకాకుండా పుత్ర పురోభివృద్ధి కూడా జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని ప్రదోష వ్రతాన్ని పాటించడం వల్ల కలిగే లాభాలేంటో, వ్రతం పాటించే క్రమంలో చేయాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సుమారు 19 సంవత్సరాల తర్వాత శ్రావణ మాసంలోని అధికమాసంలో ఈ వ్రతాన్ని ఆచరించబోతున్నాం. దీని కారణంగా శని దేవుడితో పాటు, శివుడికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు శివునికి రుద్రాభిషేకం చేయడం కూడా చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శివుడికి వెండి పాము సమర్పించడం వల్ల కూడా కాలసర్ప దోషం నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ వ్రతం ఆచరించే రోజు రుద్రాభిషేకం చేయడం వల్ల పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. శని ప్రదోష వ్రతంలో భాగంగా తప్పకుండా దేవుడికి తైలాభిషేకం చేయాల్సి ఉంటుంది.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
శని సడే సతి ఉన్నవారు ఇలా చేయండి:
శని ప్రదోష వ్రతం శని సంచారం చేసిన రాశులవారు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మేషం, వృశ్చిక రాశి వారు ఈ వ్రతాన్ని పాటిస్తే శని సడే సతి నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా వీరి శని దేవుడితో పాటు, శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.
శని సడే సతి తరచుగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. జూలై 15న ప్రదోష వ్రతం పాటించడం వల్ల శని సడే సతి నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook