Shani Rahu Yuti 2023: అక్టోబరు 17 వరకు వీరిని ఇబ్బంది పెట్టనున్న శని-రాహువు.. ఇందులో మీరున్నారా?
Shani Rahu Yuti 2023: ప్రస్తుతం శనిదేవుడు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ నక్షత్రానికి అధిపతిగా రాహువును పరిగణిస్తారు. శని-రాహు కలయిక వల్ల ఈ సమయంలో నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండండి.
Shani Gochar Effect 2023: మనం చేసే పనులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఆయనను ఆస్ట్రాలజీలో కర్మ ప్రదాత అంటారు. మార్చి 15న శనిగ్రహం కుంభరాశిలో సంచరిస్తూ శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించింది. ఈ నక్షత్రాన్ని రాహువు పరిపాలిస్తున్నాడు. దీంతో శతభిషా నక్షత్రంలో శని-రాహువు కలయిక ఏర్పడబోతుంది ఈ కూటమి అక్టోబరు 17 వరకు ఇలానే ఉంటుంది. ఈ సమయంలో ఏ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉంటారో తెలుసుకోండి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఈ రాశి వారిపై శని సడే సతి జరగబోతుంది. శతభిష నక్షత్రంలో శని సంచారం వల్ల కర్కాటక రాశి వారికి సమస్యలు పెరుగుతాయి. మీరు పని నిమిత్తం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారు అక్టోబర్ 17 వరకు ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండండి.
కన్య రాశి
శని శతభిష ప్రవేశం కారణంగా కన్యా రాశి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటారు. ఈ సమయంలో మీరు నష్టాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేరు. మీరు ఇంటి ఖర్చుల కోసం రుణం తీసుకోవల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉంది.
Also Read: Surya Gochar 2023: ఇవాళ మేషరాశిలోకి సూర్యుడు.. ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం..
వృశ్చిక రాశి
శని రాహు యుతి వృశ్చిక రాశి వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీకు ప్రభుత్వ అధికారులతో విభేదాలు రావచ్చు. మీరు ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది, లేదంటే బంధం తెగిపోతుందేమోనని భయం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేకపోతే ప్రమాదం జరగవచ్చు.
కుంభ రాశి
కుంభ రాశికి అధిపతిగా శనిదేవుడిని భావిస్తారు. శని గ్రహం రాహువుతో సఖ్యతగా ఉండటం వల్ల మీరు గొప్ప ప్రయోజనాలు పొందుతారు. మీ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. కుటుంబంలో సంతోషం ఉండదు. ఈ సమయంలో మీకు ఇష్టమైన వారిని వదిలేస్తారు.
Also Read: Grahan Yog 2023: నేటి నుంచి 'గ్రహణ యోగం'... వచ్చే నెల రోజులపాటు ఈ రాశులవారు జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి