Shanidev: మకర రాశిలోకి శని గ్రహంతో పాటు ఆ 3 రాశులు.. దీంతో ఈ రాశుల వారు విపరీతమైన డబ్బు పొందే ఛాన్స్..
Shani Rashi Parivartan 2023: మకర రాశిలోకి 4 గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. కాబట్టి పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
Shani Rashi Parivartan 2023: జోతిష్య శాస్త్రం ప్రకారం రాశుల కలయిక, గ్రహాల సంచారాలు చాలా ముఖ్యమైనదిగా పేర్కోన్నారు. అయితే ప్రతి సంవత్సరంలో గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. ఈ సంచారల వల్ల పలు రాశులవారకి చాలా రకాల ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశువారికి దుష్ర్పభావాలు కలిగే ఛాన్స్ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే చివరి నెలల్లో జరిగే గ్రహ సంచారాలు ఎంతో ప్రముఖ్యమైనవి. అంతేకాకుండా ఈ సంచారాల కారణంగా మనుషుల జీవితంలో కూడా చాలా మార్పులు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నెలలో మకరరాశిలో శని, బుధ, శుక్ర గ్రహాలు సంచార్ చేయబోతున్నాయి. దీంతో త్రిగ్రహి యోగం ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే 2023 సంవత్సరంలో ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశువారి జీవితాలు మారబోతున్నాయి:
మేష:
మకరరాశిలో ఏర్పడే త్రిగ్రాహి యోగం మేషరాశి వారికి చాలా మేలు చేస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో మేష రాశివారు వృత్తి పరంగా విజయాలు పొందే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ సంచారాల కారణంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే చాలా లాభాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ నెలలో అనుకున్న పనులు చేయగలుగుతారు.
కర్కాటక:
శని, బుధ, శుక్ర గ్రహాల సంచారం వల్ల ఏర్పడే త్రిగ్రాహియోగం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా కర్కాటక రాశి వారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆస్తి పరంగా విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ క్రమంలో అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కన్యారాశి:
త్రిగ్రాహి యోగం సంచారం వల్ల కన్యారాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం ఎదురుచుస్తున్నవారికి ఉద్యోగాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఖర్చులన్ని తగ్గి ఆధాయం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా వివాహితుల జీవితంలో సంతోషాలు కలగొచ్చు.
మీన:
మీన రాశి వారికి కూడా ఈ సంచారం వల్ల మంచి ప్రయోజనాలు కలుగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో కార్యాలయంలో కొత్త బాధ్యతలు కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంభ జీవితంలో చాలా రకాల ప్రశాంతత లభిస్తోంది.
Also Read: Saphala Ekadashi 2022: సఫల ఏకాదశి రోజున ఇలా చేస్తే.. జీవితాంతం లాభాలే..లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.