Shani Remedies: శని మహాదశ నుండి బయటపడాలంటే... శనివారం ఈ పరిహారాలు చేయండి!
Shani dev: మీరు శని మహాదశను ఎదుర్కొంటున్నట్లయితే.. మీరు శనివారం కొన్ని పరిహారాలు చేయడం ద్వారా శని దేవుడి అనుగ్రహాన్ని పొందవచ్చు.
Saturday Remedies: మీరు మంచి పనులు చేస్తే శుభఫలితాలను, చెడు పనులు చేస్తే అశుభ ఫలితాలను ఇస్తాడు శనిదేవుడు. శనిదేవుడి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అందుకే శనిదేవుడును న్యాయదేవుడు అంటారు. ప్రతి వ్యక్తి శనిదేవుడి (Shani dev) అనుగ్రహం పొందడానికి అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకవేళ మీరు శనిమహాదశను ఎదుర్కొంటున్నట్లియితే... శనివారం ఈ పరిహారాలు చేయడం ద్వారా శనిదేవుడి అనుగ్రహం పొందవచ్చు.
ఈ పరిహారాలు చేయండి
చిలుక: మిమ్మిల్ని కష్టాలు చుట్టుముట్టినట్లయితే...శనివారం చిలుకతో కూడిన పంజరాన్ని ఇంటికి తీసుకువచ్చి.. ఆ చిలుకను బయటకు స్వేచ్చగా వదిలేయండి. చిలుక ఎంత దూరం వెళ్తుందో...ఆ వ్యక్తి యెుక్క అదృష్టం అంతగా ప్రకాశిస్తుందని నమ్ముతారు.
నల్ల నువ్వుల లడ్డూలు: శనిదోషం తగ్గాలంటే శుక్రవారం రాత్రి ఎనిమిది గ్రాముల నల్ల నువ్వులను నీళ్లలో నానబెట్టి శనివారం నాడు మెత్తగా చేసి బెల్లం కలిపి 8 లడ్డూలను తయారుచేయాలి. వీటిని నల్ల గుర్రానికి తినిపించండి. ఈ పరిహారం 8 శనివారాల వరకు నిరంతరం చేయండి. దీంతో మీకు శని మహాదశ నుండి ఉపశమనం లభిస్తుంది.
కోతులకు వీటిని తినిపించండి: శాస్త్రాల ప్రకారం, శనివారం నాడు కోతులకు బెల్లం మరియు శనగపిండి తినిపిస్తే దురదృష్టం కూడా అదృష్టంగా మారుస్తుంది. ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి.
నల్ల మిరియాలు: శనివారం నాడు ఎండుమిర్చి, 11 రూపాయలు నల్ల గుడ్డలో కట్టి దానం చేయడం వల్ల శని ధైయా, సాడే సతి అశుభాలు తగ్గుతాయి.
శమీ చెట్టు: శనిదేవుడి ఆగ్రహాన్ని పోగొట్టుకోవడానికి శనివారం శమీ చెట్టును పూజించండి. శమీ వృక్షాన్ని శని దేవుడి రూపంగా భావిస్తారు. ఈ రోజున, ఈ మొక్కను గాలి దిశలో నాటడం వల్ల శని దేవుడి అనుగ్రహం మీపై ఉంటుంది.
Also Read: Shadashtak Yog: త్వరలో శని-శుక్ర 'షడష్టక యోగం'.. ఈ 4 రాశులవారి లైఫ్ ఖతం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook