Saturn Transit in Aquarius Start Sade Sati 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం తన మొదటి రాశిలోకి వచ్చేందుకు దాదాపు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు దాకా పడుతుంది. శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి 30 సంవత్సరాల తర్వాత సంచారం చేయబోతోంది. పంచారం జనవరి 17 2023లో జరిగే అవకాశాలున్నాయి. శని గ్రహం ఇంతకుముందు ఏప్రిల్ లో ఇతర రాశిలోకి ప్రవేశించినప్పటికీ ఆ తర్వాత మకర రాశిలోకి సంచారం చేసింది. ఎంతో పలు రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరాయి. 30 ఏళ్ల తర్వాత తన సొంత రాశిలోకి సంచారం చేయబోతున్న శని గ్రహం దాదాపు కుంభరాశిలో 2025 సంవత్సరం దాకా ఉండబోతున్నట్లు సమాచారం. సంచారం వల్ల అన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల్లో సడే సతి, ధైయా మొదలవుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభరాశిలో సంచారం క్రమంలోని సాడే సతి రెండవ దశ ప్రారంభమవుతుంది:


కుంభరాశిలో శని ప్రవేశం కుంభరాశిపై సడే సతి రెండవ దశ ప్రారంభమవుతుంది. దీంతో ఆ రాశి వారికి మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో కుంభ రాశి వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంచారం కారణంగా ఏదైనా పనులు మొదలు పెడితే నష్టాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో ఎలాంటి కార్యక్రమాలు, వ్యాపారాలు మొదలు పెట్టకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


కుంభ రాశి వారిపై సడే సతీ అత్యంత ప్రభావం చూపబోతోంది: 
కుంభరాశిలోకి శని గ్రహం సంచారం చేయడం వల్ల నష్టాలు కలగడమే కాకుండా పలు రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంచారం ప్రభావం కారణంగా వీరికి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చిన ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు ఈ క్రమంలో కుంభ రాశి వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు వాటిపై జాగ్రత్త వహించి ఇంటర్వ్యూలను అటెండ్ కావలసి ఉంటుంది.



వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు:
సడే సతి రెండవ దశ కారణంగా వైవాహిక జీవితంలో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుంభ రాశి వారికి జీవిత భాగస్వామితో విభేదాలు పెరిగి తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. లేకపోతే దాంపత్య జీవితానికే ప్రమాదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Ind Vs Ban: నేడే ఆఖరి వన్డే.. క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకునేందుకు టీమిండియా మాస్టర్ ప్లాన్..!  


Also Read: Allu Arjun Team : బన్నీ టీం వల్ల తడిసిమోపడైంది!.. పుష్ప కోసం రష్యాలో పెట్టిన ఖర్చు ఎంతంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook