Shani Sade Sati 2023: శని సాడే సతి, శని ధైయా బాధపడేవారికి ఆ రోజు ఎంతో శుభప్రదమైనది!
Shani Sade Sati and Shani Dhaiya: శని సాడే సతి, శని ధైయా బాధపడేవారికి నవంబర్ 4వ తేది చాలా ముఖ్యమైనదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే శని గ్రహం ఇదే రోజు తిరోగమన దశలో తిరిగింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు ప్రారంభమవుతాయి.
Shani Sade Sati and Shani Dhaiya: నవంబర్ 4వ తేదిన శని గ్రహం గమనాన్ని మర్చుకుంది. ఈ గ్రహం గమనం, సంచారం కారణంగా ప్రత్యేక ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. ముఖ్యంగా శని సాడే సతి, ధైయాతో బాధపడుతున్న వారిపై ఎక్కువ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సడేసాటి, ధైయాతో బాధపడుతున్న 5 రాశుల వారికి నవంబర్ 4 చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇదే రోజు శని గ్రహం గమనాన్ని మార్చుకున్నాడు. అయితే ఈ మార్పుల కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శని సాడే సతి, శని ధైయా ప్రభావం కలిగిన రాశులు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడు. వ్యక్తిగత జీవితంలో శుభకరమైన పనులు చేస్తే శని వారిపై శుభ ప్రభావమే చూపుతాడు. అదే వ్యక్తిగత జీవితంలో ఇతరులకు కీడు కలిగించే పనులు చేస్తే శని వారికి దుష్ప్రభావాలు కలిగిస్తాడు. శని 2025 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. శని కుంభరాశిలో ఉండటం వల్ల 5 రాశుల వారిపై నేరుగా ప్రభావం పడుతోంది. ప్రస్తుతం మకర, కుంభ, మీన రాశులకు శని సాడే సతి కొనసాగుతుండగా..కర్కాటక, వృశ్చిక రాశులకు శని ధైయ ప్రభావం నడుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
శని సాడే సతికి ఎన్ని దశలు ఉంటాయో తెలుసా?:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..శని సాడే సతికి మూడు దశలు ఉంటాయి. ప్రస్తుతం మకర రాశి వారికి మూడో దశ సాడే సతి కొనసాగుతోంది. కుంభ రాశి వారికి రెండో దశ, మీన రాశి వారికి మొదటి దశ కొనసాగుతోంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
శని ధైయ కాలం:
ఏ రాశి వారిపైనా శని ధాయ ప్రభావం రెండున్నరేళ్లపాటు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని గ్రహం రాశి సంచారాలు చేయడం వల్ల శని ధైయ ప్రభావం తొలగిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఈ శని ధైయ ప్రభావం కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మిథునం, తుల రాశులపై కొనసాగుతోంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
నవంబర్ 4వ తేదీ ఎందుకు ప్రత్యేకం:
శని గ్రహం నవంబర్ 4 కుంభరాశిలో ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు. అంటే శని గ్రహం ఈ సమయంలో తిరోగమన దిశలో తిరుగుతూ కదులుతున్నాడు. దీని కారణంగా సాడే సతి, ధైయాతో బాధపడేవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యక్తగత జీవితాల్లో కూడా సానుకూల మార్పులు వస్తాయి.
శనిదేవుని అనుగ్రహం కోసం చేయాల్సి రెమెడీస్:
శనివారం రోజు శని చాలీసా పఠించాల్సి ఉంటుంది.
శని దేవాలయానికి వెళ్లి శనిదేవుని దర్శనం చేసుకోవాలి.
శనిదేవునికి ఇష్టమైన వస్తువులు శనివారం మాత్రమే దానం చేయాల్సి ఉంటుంది.
శనివారం పేదవారికి సహాయం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఈ రోజే ఉసిరి చెట్టుకింద నెయ్యితో దీపం వెలిగించాల్సి ఉంటుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook