Rajyog 2024: న్యూ ఇయర్ లో ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం.. మీ రాశి ఉందా?
Shani Shukra Gochar 2024: నూతన సంవత్సరంలో రెండు కీలక రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఆస్ట్రాలజీలో ఈ రాజయోగాలను పవిత్రమైనవిగా భావిస్తారు. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు.
Benefits of Rajyog 2024: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభయోగాలను సృష్టిస్తాయి. 2024లో శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా మాళవ్య రాజయోగం ఏర్పడుతోంది. ఇదే సమయంలో శనిదేవుడు శష్ రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. ఈ రెండు రాజయోగాల వల్ల కొత్త సంవత్సరంలో కొందరి ఫేట్ మారబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహ రాశి: కొత్త సంవత్సరంలో సింహరాశి వారు చాలా ప్రయోజనాలను పొందనున్నారు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ఆస్తులు పెరుగుతాయి. మీకు లక్ కలిసి వస్తుంది.
వృషభ రాశి: శష్ మరియు మాలవ్య రాజయోగాలు వృషభరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. వాయిదా పడుతూ వస్తున్న ప్రమోషన్ మీకు దక్కుతుంది. ఈ సమయంలో మీరు విలువైన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
కుంభ రాశి: శుక్రుడు మరియు శని అనుగ్రహం వల్ల కుంభరాశి వారు చాలా లాభాలను పొందుతారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Also Read: Shani Nakshatra Gochar: శని నక్షత్ర మార్పు.. 2024లో ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter