Holi 2024 Rasi Phalalu: కులమతాలకు అతీతంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో హోలీ కూడా ఒకటి. ఈ రంగుల హోలీకి మనదేశంలో చాలా విశిష్టత ఉంది. దీని వెనుక పురాణ గాథ కూడా దాగి ఉంది.  అలాగే ఈ ఫెస్టివల్ మార్చి 25న రాబోతుంది. అయితే దీనికి ఎనిమిది రోజుల ముందు హోలాష్టకం ప్రారంభమవుతుంది. మార్చి 17 నుండి ప్రారంభమై ఈ హోలాష్టకం సమయంలో శుభ కార్యాలు నిషిద్ధం. అదే విధంగా శని, సూర్యుడు మరియు రాహువు గ్రహ స్థానాలు కొన్ని రాశులవారికి ఇబ్బందులను కలిగించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోలీకి ముందు మార్చి 18న శనిదేవుడు కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. మార్చి 14న సూర్యుడు మీనరాశిలోకి వెళ్లనున్నాడు. అప్పటికే అదే రాశిలో సూర్యుడు, రాహువు కలయిక వల్ల గ్రహణ యోగం రూపొందుతోంది. ఆస్ట్రాలజీలో గ్రహణ యోగాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ గ్రహాల స్థానం కారణంగా 5 రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. దీని కారణంగా వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


ఈ రాశులపై చెడు ప్రభావం
శని, సూర్యుడు, రాహువుల గమనంలో మార్పు హోలీకి ముందు మకర, కుంభ, మీన, కర్కాటక, వృశ్చిక రాశుల మీద చెడు ప్రభావం చూపుతుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా నష్టపోతారు. మీరు కీర్తి ప్రతిష్టలను కోల్పోయే అవకాశం ఉంది. మీరు మెుదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. మీకు లక్ కలిసిరాదు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Unknown Facts About Holi Festival: హిరణ్య కశ్యపుడుకి హోలీ పండగకి సంబంధమేంటి.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు..


Also Read: Budh Uday 2024: రేపు ఉదయించబోతున్న బుధుడు.. ఈ 4 రాశులకు వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి