Shani Transit 2022: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శని అనుగ్రహముంటే అంతా మంచే జరుగుతుందని చెబుతుంటారు పెద్దలు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం శనిదేవుడికి సంబంధించి దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఓ అద్భుతం చోటు చేసుకోనుందట. కర్మలకు ప్రతిగా భావించే శని దేవుడు ఏప్రిల్ 29న తన రాశిని మార్చుకోనున్నాడట. దీనితో సుమారు 30 సంవత్సరాల తర్వాత, శని దేవుడు తన సొంత రాశి అయిన మకరం నుంచి తన రెండవ రాశిగా పిలిచే కుంభరాశిలోకి ప్రవేశిస్తాడట. శని రాశి మారటం వల్ల అన్ని రాశుల వారి రాశి ఫలాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయట. కొన్ని రాశులపై శని దేవుడి పరివర్తనం ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశివారికి ఒక వరం..


శని రాశి మారడం వృషభ రాశి వారికి ఒక వరం అంటున్నారు జ్యోతిష్యులు. శనిదేవుని అనుగ్రహంతో ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుందట. ముఖ్యంగా వృత్తి, వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు ఉండనున్నాయని చెబుతున్నారు. సంపద కూడా పెరుగుతుందని అంటున్నారు. అదృష్టం మారి జీవితంలో ఎంతో సంపదను, పురోగతిని సాధిస్తారు.


సింహ రాశి వారికి ఆర్థిక లాభం..


శని రాశి మారడం వల్ల.. సింహ రాశి వారికి ఆర్థికాభివృద్ధి కలుగుతుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. గతంలో ఎవరైనా శని ఆగ్రహానికి గురై ఉంటే.. వారికి విముక్తి లభిస్తుందని అంటున్నారు.  ఈ రాశి వారు సంపదను పెంచుకోవడంలో విజయం సాధిస్తారట. ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టిన విజయం సొంతం చేసుకుంటారని చెబుతున్నారు. 


కన్య రాశివారికి కలిసి రానున్న అదృష్టం..


శని పరివర్తనంతో కన్యారాశికి అదృష్టం కలిసి వస్తుందట. శని పరివర్తన సమయంలో ఆర్థికంగా పటిష్టమవడంతోపాటూ.. సంఘంలో గౌరవం పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. దాదాపు అన్ని రంగాల  వారికి ధనలాభం కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి లభిస్తుంది. పెట్టుబడి పెట్టేందుకు ఇది అత్యంత అనుకూలమైన సమయం.


ధనుస్సు రాశి వారిని అదృష్టం వరిస్తుంది..


శని రాశి మార్పుతో ధనుస్సు రాశి వారికి ధనలాభం ఉంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో చేసే పనిలో అద్భుతమైన విజయాన్ని సాధించగలుగుతారట. దీర్ఘకాలికంగా వేదిస్తున్న సమస్యలు, చిక్కుల నుంచి బయటపడగలుగుతారని చెబతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇక ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. అప్పుల నుంచి గట్టెక్కుతాని చెబుతున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరే అవకాశాలున్నాయి అంటున్నారు.


(నోట్​: ఇందులోని సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఈ విషయాలను ZEE తెలుగు NEWS ధ్రువీకరించలేదు.)


Also read: Vastu Tips: ఈ 5 మొక్కలను ఇంటికి తప్పుడు దిశలో నాటితే ఆర్థిక నష్టాలు తప్పవట!


Also read: Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజున ఈ పూజ చేస్తే శని నుంచి విముక్తి తథ్యం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook